కేరళలోని శబరిమల లో అయ్యప్ప స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు
మన దేశ చరిత్రలో ఒక మహిళా రాష్ట్రపతి శబరిమల ను దర్శించుకోవడం ఇదే మొదటిసారి
అత్యున్నత పదవిలో ఉండి కూడా ఆమె ప్రోటోకాల్ ను పక్కనబెట్టి ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ మాల ధరించి ఇరుముడిని తలనబెట్టుకుని 18 మెట్లు ఎక్కి స్వామి వారి దర్శనం చేసుకున్నారు
67 ఏళ్ళ వయసులోనూ ద్రౌపది ముర్ము భక్తి శ్రద్దలతో ఆలయ విశ్వాసాలను గౌరవిస్తూ నడుచుకుంటూ వెళ్లి స్వామి దర్శనం చేసుకోవడం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు
మంగళవారమే కేరళ చేరుకున్న రాష్ట్రపతి బుధవారం ఉదయం శబరిమలలో స్వామి వారి దర్శనం చేసుకోవడం కోసం పంబా నదీ ప్రాంతానికి చేరుకున్నారు
అక్కడినుంచి ఆలయ సంప్రదాయం ప్రకారం మాల ధరించి ఇరుముడిని తల మీద పెట్టుకుని 18 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకున్నారు
ప్రస్తుతం దేశం మొత్తం రాష్ట్రపతి శబరిమల దర్శనం గురించి స్పందనలు తెలియచేస్తుంది
అత్యున్నత పదవిలో ఉండి కూడా ఇంత సింపుల్ గా , ఇంత హానెస్ట్ గా ఆమె స్వామి దర్శనం చేసుకోవడం వెనుక తన మూలాలను మర్చిపోలేదు
ఒడిశాలోని మయూర్ భంజ్ లోని ఓ కుగ్రామం ఉపర్ బేడా లో సాధారణ ఆదివాసీ కుటుంబంలో జన్మించారు ద్రౌపది ముర్ము
ఆమె భువనేశ్వర్ లోని రమాదేవి కళాశాలలో బిఎ పూర్తిచేసుకుని ఉపాధ్యాయురాలిగా జీవితాన్ని ప్రారంభించింది
1977-83 మధ్య ఓడిశాలోని నీటిపారుదల శాఖలో క్లర్క్ గా పనిచేసింది
1997 లో బీజేపీ పార్టీలో చేరి రాయరంగాపూర్ పంచాయతీ కౌన్సిలర్ గా ఎన్నికైంది
అంతే అక్కడ్నుంచి ఆమె రాజకీయ జీవితం అంచెలంచెలుగా ఎదిగింది
కౌన్సిలర్ గా ప్రారంభమైన ఆమె రాజకీయ జీవితం ఎమ్మెల్యేగా , మంత్రిగా , గవర్నర్ గా చివరికి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి స్థాయికి ఎదిగింది
ఈ ఎదుగుదలకు యెంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆమె గుణమే కారణం
పేరులోనే కాదు నిజ జీవితంలో కూడా ఆమెదంతా ఆధ్యాత్మిక బాటే
ఆమె గొప్ప దైవ భక్తురాలు
రాష్ట్రపతి పదవికి ఆమె పేరును ప్రకటించినప్పుడు కూడా ఆమె ఫక్తు రాజకీయ నాయకుల మాదిరి పొంగిపోయి ప్రెస్ మీట్లతో హడావుడి చేయలేదు
ఎటువంటి ఆడంబరాలకు పోలేదు
సింపుల్ గా శివాలయానికి వెళ్లి చీపురుతో ఆలయం మొత్తం శుభ్రం చేసింది
ఇది మనం ఊహించగలమా ?
కాసేపట్లో అత్యంత విలాసవంతమైన రాష్ట్రపతి భవన్ లోకి వెళ్ళబోతున్నా కూడా ఆ అధికార దర్పాన్ని యెంత మాత్రం తలకెక్కించుకోకుండా సాధారణ మహిళ మాదిరి భక్తితో ఆలయం శుభ్రం చేయడం ఆమెలోని ఆధ్యాత్మిక కోణాన్ని తెలియచేస్తుంది
దేశంలో అత్యున్నత పదవి , హోదా , ఆధ్యాత్మిక భావనల వెనుక ఆమె జీవితంలో అతి కొద్దిమందికే తెలిసిన దుఃఖాన్ని దిగమింగుకున్న విషాదం కూడా ఉంది
భర్తను , ఇద్దరు కుమారులను కోల్పోయిన సంఘటనలు 67 ఏళ్ళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితంలో అత్యంత విషాదకర క్షణాలు
అయినా గుండె నిబ్బరంతో దైర్యంగా ఉంటూ నమ్మిన దైవాన్ని స్మరించుకుంటూ ఆమె చేసిన శబరిమల యాత్ర భారత దేశ చరిత్రలో రికార్డుగా నిలిచిపోతుంది !
