బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఒకానొక టైం లో తన వీరోచిత పాత్రలతో ఇండియన్ స్క్రీన్ ని షేక్ చేసాడు
ముఖ్యంగా షోలే సినిమాలో ధర్మేంద్ర తన విశ్వ రూపాన్ని ప్రదర్శించాడు
ఈ సందర్భంగా ఇక్కడొక విషయం చెప్పుకోవాలి
షోలే సినిమాలో అమితాబ్ బదులు ముందు శత్రుఘ్న సిన్హా ని తీసుకోవాలని అనుకున్నారు
కానీ ఆ మూవీలో అమితాబ్ అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందని ధర్మేంద్ర పట్టుబట్టి మరీ దర్శకుడ్ని ఒప్పించాడు
ఆ తర్వాత షోలే బాక్సాఫీస్ రికార్డులను ఎలా బద్దలు కొట్టిందో అందరికీ తెలిసిందే
సినిమాల్లో వీరోచిత పాత్రలకు పెట్టింది పేరు అయిన ధర్మేంద్ర నిజ జీవితంలో కూడా హీరోలా ఉండేవాడు
ఈ విషయాలను ఓ టాక్ షో లో ఒకప్పటి బాల నటుడు సత్యజిత్ పూరీ రివీల్ చేసాడు
70- 80 వ దశకంలో ముంబైని అండర్ వరల్డ్ మాఫియా శాసించేదని అందరికీ తెలిసిందే
ఈ మాఫియా కబురు చేస్తే యెంత పెద్ద హీరో అయినా పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళు అడిగినంత కప్పం చెల్లించాల్సిందే
లేకపోతె సినిమా అవకాశాల సంగతి దేవుడెరుగు , అసలుకు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి
ఇలాగే ఓసారి ధర్మేంద్రకు కూడా అండర్ వరల్డ్ నుంచి పిలుపొచ్చింది
“మేము చెప్పిన టైముకి అడిగినంత కప్పం చెల్లించటానికి నువ్వు రాకపోతే మా మనుషులే నీ దగ్గరికి వస్తారు .. వాళ్ళు కనుక నీ దగ్గరికి వస్తే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు ” అని బెదిరించారు
కానీ ధర్మేంద్ర ఆ బెదిరింపులకు ఏ మాత్రం బెదిరిపోలేదు
సరి కదా మాఫియా నాయకులు ఊహించని విధంగా దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు
“మీరు ఎంతమంది వస్తారో రండి .. ఇద్దరా ? నాలుగురా ? వంద మందా ? అంతే కదా .. నాజోలికి వస్తే పంజాబ్ నుంచి ట్రక్కులో నా సైన్యం వస్తుంది .. నా అభిమానులు కనుక వస్తే ఎటువంటి ఆయుధాలు అక్కర్లేదు .. మిమ్మల్ని కాలి కింద తొక్కి చంపేస్తారు .. అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను .. నాజోలికి రాకండి .. మీకు పైసా కప్పం కట్టేది లేదు .. ఏం చేసుకుంటారో చేసుకోండి ” అని తెగేసి చెప్పాడు
ధర్మేంద్ర దైర్యం వెనుక ఓ నిజం ఉంది
అప్పట్లో అతడి అభిమానులే అతడి సైన్యం
ధర్మేంద్రకు మాఫియా నుంచి బెదిరింపులు వచ్చినప్పుడు అతడి అభిమానులు ” ధరమ్ జీ .. మీరు లొంగకండి .. మీ వెనుక మేమున్నాం ” అని భరోసా ఇచ్చి అండగా నిలబడ్డారు
దాంతో చేసేదేమీ లేక అండర్ వరల్డ్ డాన్ లు కూడా ధర్మేంద్ర జోలికి రావడం మానేశారు
ప్రస్తుతం 89 ఏళ్ళ వయసులో కూడా ధర్మేంద్ర దర్శకుడు అమిత్ జోషి షాహిద్ కపూర్ , కృతి సనన్ లతో చిత్రీకరిస్తున్న మూవీలో కనిపిస్తారు!
