శనివారం నాడు గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి
ఎటు చూసినా ఇసుకేస్తే రాలని జనాలు
జైబోలో గణేష్ మహరాజ్ నినాదాలు
ఈ జనసందోహంలోకి ఎక్కడ్నుంచి వచ్చాయో మూడు కార్లు దూసుకొచ్చాయి
ముందు అక్కడ డ్యూటీ చేస్తున్న సిబ్బందికి కూడా అర్ధం కాలేదు
అంత ట్రాఫిక్ లో ఆ కార్లలో వచ్చిన వీఐపీ ఎవరనేది?
బాగా రద్దీ ఉన్న చోట కారు ముందుకు కదిలే వీలు లేకపోవడంతో కారులోనుంచి సింపుల్ గా కుర్తా ధరించిన సీఎం రేవంత్ దిగడంతో ఆశ్చర్య పోవడం జనాల వంతైంది
చెప్పాపెట్టకుండా ఉన్నపళంగా సీఎం అక్కడికి వస్తాడని వాళ్ళు కూడా ఊహించినట్టు లేదు
రేవంత్ కారు దిగి నడవటం మొదలుపెట్టడంతో జనాలు సెల్ఫీల కోసం పోటీలు పడ్డారు
వారిని అదుపుచేయడం పోలీసులకు తలకు మించిన భారమైంది
మాములుగా సీఎం జనాల మధ్యలోకి వస్తే రోప్ పార్టీ సిద్ధంగా ఉంటుంది
బహుశా రేవంత్ అకస్మిక పర్యటన అయ్యుంటుంది
రోప్ పార్టీ వంటి హడావుడి లేదు
ఎటువంటి సెక్యూరిటీ హంగామా లేకుండా రేవంత్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కలియతిరిగారు
నిమజ్జనం కోసం వచ్చిన జనాలను చూసి చేతులు ఊపుతూ ఉత్సాహపరిచారు
అందివచ్చిన అవకాశాలను వాడుకోవడం నాయకత్వ లక్షణం అనిపించుకుంటుంది
ఈ అవకాశాన్ని రేవంత్ వాడుకున్నాడు
ఇంట్లో కూర్చోకుండా సింగిల్ గా జనంలోకి వచ్చాడు
బంగ్లాలలో కూర్చుని పాలన చేసేవాడికన్న జనాల్లో తిరిగే నాయకుడికే ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది
ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు దొరికాడు!
పరేష్ తుర్లపాటి
రేవంత్ మార్క్ !
