2025 ఆసియా క్రికెట్ కప్ బరిలోకి దిగేముందు రోహిత్ శర్మ భార్య రితిక తనకు కొన్ని సలహాలు ఇచ్చిందని క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పారు
ఆమె సలహాతోనే పాకిస్తాన్ తో మ్యాచులు ఆడేటప్పుడు అంత వత్తిడిలోనూ ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోగలిగానని ఆయన చెప్పారు
మ్యాచులు ఆడేటప్పుడు స్మార్ట్ ఫోన్ లో ఉన్న సోషల్ మీడియా యాప్స్ అన్నీ డీ ఆక్టివేట్ చేసుకోమని రితిక నాకు సలహా ఇచ్చింది
రోహిత్ శర్మ కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతాడని ఆమె చెప్పింది
మ్యాచులు ఆడేటప్పుడు మన కాన్సంట్రేషన్ ను అవి దెబ్బ తీస్తాయని ఆమె నాకు చెప్పారు
ముఖ్యంగా మ్యాచులు జరిగేటప్పుడు వాట్సాప్ , ఫేస్ బుక్ , ఇన్స్టాగ్రామ్ ల ద్వారా రకరకాల సందేశాలు , సలహాలు వస్తుంటాయని , అవి చూడటం వల్ల మనం స్వతంత్రంగా ఆలోచించే అవకాశం పక్కకి జరిగి కొంత గందరగోళ పరిస్థితుల్లోకి చేరుకుంటామని , అందుకే రోహిత్ శర్మ మ్యాచులు జరిగే రోజుల్లో తన స్మార్ట్ ఫోనులో సోషల్ మీడియా యాప్స్ అన్నీ డీ ఆక్టివేట్ చేసుకుంటాడని ఆమె చెప్పారు
ఆసియా కప్ ఆడుతున్న రోజుల్లో రితిక సలహా నేను కూడా పాటించి నా మొబైలులో సోషల్ మీడియా యాప్స్ అన్నీ డీ ఆక్టివేట్ చేసుకున్నానని సూర్యకుమార్ యాదవ్ చెప్పారు
దీనివల్ల మైదానంలో విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు సరైన నిర్ణయం తీసుకునే శక్తీ వచ్చిందని ఆయన చెప్పారు
ఆసియా కప్ క్రికెట్లో తన ఆట తీరు కొంత నిరాశ కలిగించినప్పటికీ రితిక ఇచ్చిన సలహా ఆచరించి ముందు ముందు నా ఆట తీరును మరింత మెరుగుపర్చుకుంటానని సూర్యకుమార్ యాదవ్ ఆత్మ విశ్వాసంతో చెప్తున్నారు !
