Home » సల్మాన్ ఖాన్ తలరాత ఏంటో కానీ పెళ్లి సంగతి అటుంచితే పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోతున్నాడు .. ఓపక్క కృష్ణజింక వివాదం అలా ఉండగానే ఇప్పుడు ఏకంగా అతడ్ని ఉగ్రవాదుల జాబితాలో వేసేసారు !

సల్మాన్ ఖాన్ తలరాత ఏంటో కానీ పెళ్లి సంగతి అటుంచితే పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోతున్నాడు .. ఓపక్క కృష్ణజింక వివాదం అలా ఉండగానే ఇప్పుడు ఏకంగా అతడ్ని ఉగ్రవాదుల జాబితాలో వేసేసారు !

Spread the love


సల్మాన్ ఖాన్ తల రాత ఏంటో కానీ ఆదినుంచీ అన్నీ వివాదాలే
ముదురు వయసు వచ్చినా పెళ్లి కాలేదన్న విషయం అటుంచితే రోజురోజుకీ వివాదాల్లో కూరుకుపోతున్నాడు

కృష్ణజింకను వేటాడి రాజస్థాన్ లోని బిష్ణోయ్ తెగతో వివాదం ఏరికోరి తెచ్చుకున్నాడు
బిష్ణోయ్ తెగకు చెందిన బ్యాన్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అయితే ఏకంగా సల్మాన్ ఖాన్ తలకు ఖరీదు ప్రకటించాడు

తమ జాతి అత్యంత పవిత్రంగా పూజించే కృష్ణ జాతి జింకలను వేటాడినందుకు ప్రతీకారంగా సల్మాన్ ఖాన్ ను లేపేస్తామని బిష్ణోయ్ ఓపెన్ గా హెచ్చరించాడు

అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ సొంత సెక్యూరిటీని ఏర్పాటుచేసుకుని తిరుగుతున్నాడు

ఇదిలా ఉండగా ఈ మధ్య సల్మాన్ ఖాన్ సౌదీలోని రియాద్ లో జాయ్ ఫోరమ్ 2025 వారు నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ మళ్ళీ వివాదాల్లో ఇరుక్కున్నాడు

ఎంతలా అంటే సల్మాన్ ఖాన్ వాఖ్యల వల్ల ఆగ్రహం చెందిన పాకిస్తాన్ ఆయన్ను ఉగ్రవాదిగా ప్రకటించేంత

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పాకిస్తాన్ అయన పేరును ఉగ్రవాద నిరోధక చట్టం 4 వ షెడ్యూల్ లో నమోదు చేసినట్టు అనధికార వార్తలు బయటికి వచ్చాయి

ఈ జాబితాలో ఉగ్రవాదులు , వారికి సహకరించిన వ్యక్తుల పేర్లను చేరుస్తారుఇంతకీ సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ కు అంతలా కోపం తెప్పించే ఏమన్నాడంటే ,

“మేము ఒక హిందీ సినిమా తీసి ఇక్కడ (సౌదీ అరేబియాలో) విడుదల చేస్తే, అది సూపర్ హిట్ అవుతుంది. అలాగే ఒక తమిళ, తెలుగు లేదా మలయాళ సినిమా తీస్తే, అది వందల కోట్ల వ్యాపారాన్ని చేస్తుంది ఎందుకంటే ఇతర దేశాల నుండి చాలా మంది ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు . ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన ప్రజలే కాకుండా బెలూచిస్తాన్ నుండి వచ్చి స్థిరపడిన ప్రజలు కూడా ఉన్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుండి.. పాకిస్తాన్ నుండి వచ్చిన ప్రజలు కూడా ఉన్నారు… అందరూ ఇక్కడ పనిచేస్తూ సెటిల్ అయ్యారు. కాబట్టి ఇక్కడ ప్రపంచ స్థాయి చిత్ర వాణిజ్యం జరుగుతుందని ” అన్నాడు

దాంతో ఇస్లామాబాద్ అధికారులకు కాలింది

సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్.. పాకిస్తాన్‌ అంటూ తమ దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టి మాట్లాడటం ఏంటని ఫైర్ అయ్యారు . ఇలా మాట్లాడటం తమ దేశ ప్రాదేశిక సమగ్రతను అవమానించడమే అని మండి పడుతున్నారు

మరోవైపు, సల్మాన్ వ్యాఖ్యను బలూచ్ వేర్పాటువాద నాయకులు ప్రశంసించారు. వారు సల్మాన్ ఖాన్ వాఖ్యల పట్ల హర్షం ప్రకటిస్తూ తమ పోరాటాలను ప్రపంచం గుర్తిస్తుందని అంటున్నారు .

ఆ రకంగా రియాద్ లో సల్మాన్ ఖాన్ చేసిన వాఖ్యల వల్ల పాకిస్తాన్ కు శత్రువు , బెలూచిస్తాన్ వేర్పాటువాదులకు మిత్రుడు అయ్యాడు

ఈ వివాదం గురించి సల్మాన్ ఖాన్ ఇంతవరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

సల్మాన్ ఖాన్ కు ఇప్పటికే ఉన్న తలకాయ నొప్పులకు ఇది అదనం !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *