నిన్న జూబ్లీ హిల్స్ వైపు వెళ్తుంటే ఓ దృశ్యం నన్ను ఆకర్షించింది
ఆ దృశ్యంలో నాకు పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్ కనిపించాయి
ముందుగా నెగిటివ్ షేడ్ ఏంటంటే,
డ్రైనేజీ పనుల నిమిత్తమో.. వాటర్ పైప్ లైన్ పనుల నిమిత్తమో తెలీదు గానీ రోడ్ సైడ్ తవ్వేసి పైపులు వేసి మట్టి పూర్తిగా కప్పకుండా వెళ్ళిపోయారు దాని తాలూకా వర్కర్స్
అయితే సరిగ్గా రోడ్డు మలుపు దగ్గర సరిగ్గా మట్టి కప్పకపోవడంతో చిన్న గోతి ఏర్పడి అటునుంచి వచ్చే వాహనదారులకు ప్రమాదకరంగా తయారైంది
ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా బైకులు స్లిప్ అయి ఆ గోతిలో పడే అవకాశం ఉంది
అక్కడే కాదు హైదరాబాద్ లో చాలా చోట్ల చూసా
పైప్ వర్క్ నిమిత్తం రోడ్డు సైడ్ తవ్వేవాళ్ళు పూడ్చడం మాత్రం తమ పని కాదన్నట్టు నిర్లక్ష్యంగా వెళ్ళిపోతారు
వారి నిర్లక్ష్యం వర్షా కాలం వాహనదారులకు మరింత ఇబ్బంది కలిగిస్తుంది
గోతిలో నీరు చేరి రోడ్డు కనిపించక గోతిలో పడతారు
అంచేత రోడ్డు తవ్విన డిపార్ట్మెంట్ వాళ్ళే రోడ్డు పూడ్చే బాధ్యత కూడా తీసుకోవాలి
ఎవరైనా రోడ్ తవ్వితే పూడ్చే బాధ్యత కూడా వాళ్లదేనని ఈమధ్య GHMC అధికారులు ఇచ్చిన ప్రకటన చూసా
మంచి నిర్ణయం
కానీ అమలు చేస్తేనే గొప్ప నిర్ణయం అవుతుంది
పాజిటివ్ షేడ్ ఏంటంటే,
ఆ రోడ్లో వాహనదారుల ఇబ్బందులు అటుగా వెళ్తున్న ట్రాఫిక్ పోలీసులు గమనించారు
వెంటనే కారు ఓ పక్కన ఆపి కప్పకుండా మిగిలిపోయిన మట్టిని బుట్టల్లోకి ఎత్తి మలుపులో ఉన్న గోతులను పూడ్చారు
నిజానికి ఈ మట్టి పోసే బాధ్యత వాళ్ళది కాదు
కానీ ప్రొటోకాల్ పక్కనబెట్టి సాధారణ కూలీల మాదిరి బాధ్యత ను తలకెత్తుకున్నారు
గుడ్ జాబ్ జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీస్ 👏
పరేష్ తుర్లపాటి ✍️