సరిగ్గా 36 సంవత్సరాల క్రితం అక్కినేని నాగార్జున నాయకుడిగా , రఘువరన్ ప్రతినాయకుడిగా నిర్మించిన శివ సినిమా సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే
అప్పటికి ఈ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వయసు 26 ఏళ్ళే
ఆర్జీవీకి ఇదే మొదటి సినిమా
అప్పటికే విజయవాడలో నడుస్తున్న రెండు ప్రత్యర్థి వర్గాల వైరం నేపథ్యంలో ఆర్జీవీ శివ కథ రాసుకున్నాడు
రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా ఫలానా హీరో కోసమని కథ రాసుకోలేదు
కానీ తన కధలో శివ అనే ఒక బలమైన పాత్ర గురించి రాసుకున్నాడు
ఈ కథ పూర్తి అయ్యేటప్పటికి రఘువరన్ అయితే ప్రతి నాయకుడిగా బాగుంటుందని ఆర్జీవీ అనుకున్నాడు
అనుకోవడమే కాదు రఘువరన్ పాత్రకు శివ అనే పేరు పెడితే బాగుంటుందని కూడా డిసైడ్ అయ్యాడు
తర్వాత హీరో పాత్రకు అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి అయితే బావుంటుందని మిత్రులు సూచించారట
కానీ ఈ పాత్రకు నాగార్జున అయితే బాగుంటుందని ఆర్జీవీ ఫిక్స్ అయ్యాడు
అప్పటికి ఆర్జీవీ ఇండస్ట్రీకి కొత్త
అతడు రాసుకున్న కథ
ఆ రోజుల్లో ముద్దుల మామయ్య లాంటి రొమాంటిక్ నేపధ్యం ఉన్న సినిమాలు నడుస్తున్నాయి
కానీ శివ స్టోరీ ఎంటైర్ డిఫరెంట్ కావడంతో అక్కినేని వారి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడానికి చాలా టైం పట్టింది
కథ విన్న నాగార్జున కూడా ఇదేదో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సినిమా అవుతుందని అనుకోలేదు
నిజం చెప్పాలంటే నాగార్జునే కాదు రామ్ గోపాల్ వర్మ కూడా అనుకోలేదు
అందుకే ఎటువంటి ఎక్స్పెక్టషన్స్ లేకుండా షూటింగ్ కి కొబ్బరికాయ కొట్టేసారు
ఆర్జీవీ ముందుగా శివ టైటిల్ పేరును రఘువరన్ కు పెట్టాడు
అప్పటికి నాగార్జున పేరు డిసైడ్ కాలేదు
ఈ విషయం తెలుసుకున్న నాగార్జున శివ పేరును తనకు పెడితే బాగుంటుందని సూచించడంతో ఆర్జీవీ ఆ పేరును నాగార్జునకి పెట్టి , రఘువరన్ కు భవానీ అనే పేరును పెట్టాడు
అలా శివ సినిమాలో పేర్లు తారుమారు అయ్యాయి
శివ రిలీజ్ అయిన తర్వాత ఎలా హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే
ఈ హిట్ ను ముందుగా నాగార్జున కూడా నమ్మలేదు
రెండ్రోజుల తర్వాత కారులో వెళ్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వర రావు.. నాగార్జున భుజం తడుతూ శివ హిట్ టాక్ వచ్చింది .. గుడ్ అన్నారట
నిజానికి నాగార్జునకి సినిమా కెరీర్ పరంగా పెద్ద మలుపును , గెలుపును ఇచ్చింది శివ సినిమా
ఈ సినిమాతో నాగార్జున క్రేజీ అమాంతం పెరిగిపోయింది
తెలుగు సినిమాల్లో ఓ కొత్త ట్రెండుకు నాంది పలికినవాడు 26 ఏళ్ళ ఆ కుర్ర డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మే
శివ హిట్ తో సంతోషం పట్టలేక నాగార్జున యూనిట్ ముఖ్యులకు శివ పేరుతొ బంగారు ఉంగరాలు చేయించి గిఫ్ట్ గా ఇచ్చాడట
శివ సినిమాకి కో డైరెక్టర్ గా పనిచేసిన శివ నాగేశ్వర రావు చేతి వేలికి ఇప్పటికీ ఆ ఉంగరం ఉంది
నవంబర్ 14 న శివ సినిమా రీ రిలీజ్ చేస్తున్న సందర్భంగా రామ్ గోపాల్ వర్మ యూ ట్యూబ్ ఛానళ్లకిచ్చిన ఇంటర్వ్యూలలో పై విషయాలు చెప్పాడు !
