అనిల్ సుంకర సమర్పణలో స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నవీన్ చంద్ర , కామాక్షి భాస్కర్ల హీరో హీరోయిన్లుగా నిర్మాత గరికపాటి కిశోర్ , మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో షో టైం సస్పెన్సు థ్రిల్లర్ మూవీ జులై 4 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది !
ఇక ఈ సినిమా హీరో నవీన్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు
గతంలో కూడా సస్పెన్స్ , థ్రిల్లర్ జానర్ లో చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు
అదేంటో నవీన్ చంద్రకు క్రైమ్ స్టోరీ నేపధ్యం ఉన్న సినిమాలే ఎక్కువగా పడ్డాయి
ఇందుకు కారణం నవీన్ ఆయా పాత్రల్లో పర్ఫెక్ట్ గా ఒదిగిపోవడమే
మరోసారి షో టైం లో కూడా నవీన్ చంద్ర చక్కటి పెర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు
షో టైం కథ విషయానికి వస్తే చిన్న వివాదం ఆధారంగా పెద్ద క్రైమ్ స్టోరీని అల్లుకుపోయాడు దర్శకుడు మదన్ దక్షిణామూర్తి
ప్రేమించి పెళ్లిచేసుకున్న దంపతులు సూర్య ( నవీన్ చంద్ర ) , శాంతి ( కామాక్షి భాస్కర్ల ) రాత్రి 11 గంటల సమయంలో అపార్ట్మెంట్ టెర్రస్ పైన సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో రౌండ్స్ కు వెళ్తున్న సీఐ లక్ష్మీకాంత్ ( రాజారవీంద్ర ) గమనించి అర్ధరాత్రి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని వారికి వార్నింగ్ ఇవ్వడంతో వివాదం మొదలౌతుంది
ఈ వివాదంలో శాంతి , సీఐ లు గొడవ పడి మాటామాటా అనుకుంటారు
అది మనసులో పెట్టుకుని సీఐ తన భార్యను ఏమన్నా చేస్తాడేమో అని సూర్య అనుమానపడతాడు
సూర్య అనుమానపడ్డట్టే శాంతి ఆక్సిడెంటల్గా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది
దీనితో కథ ఊహించని మలుపు తిరుగుతుంది
ఆ కేసునుంచి సూర్య తన భార్య శాంతిని ఎలా కాపాడుకుంటాడు ?
ఈ క్రమంలో సీఐ లక్ష్మీకాంత్ ను ఎలా ఎదుర్కొంటాడు ?
లాయర్ వరదరాజులు సాయంతో ఈ కేసునుంచి ఎలా బయటపడతారు ?
అనేది మిగతా కథ
ఈ కేసులో వీరికి లాయర్ వరద రాజులు ( వీకే నరేష్ )సహాయం చేస్తాడు
అప్పటిదాకా సీరియస్ గా సాగుతున్న కథలో నరేష్ ఎంట్రీతో కామెడీ పార్ట్ మొదలౌతుంది
ఫస్ట్ హాఫ్ అంతా స్పీడుగా సాగిపోయి సెకండ్ హాఫ్ లో అసలు కథలోకి వస్తారు
సినిమా మొత్తం ఒక్కరోజులో ఒక అపార్టుమెంటులో జరిగిన సంఘటన ఆధారంగా కథ రాసుకున్నారు కాబట్టి దర్శకుడు ఎక్కడ ఎంతవరకు ప్రెజెంట్ చేయాలో అంతవరకూ జాగ్రత్తగా ప్రెజెంట్ చేసాడు
వీకే నరేష్ పాత్ర ద్వారా కామెడీ కూడా మిక్స్ చేయడంతో ప్రేక్షకులకు బోర్ అనిపించదు
సినిమాకి అనవసర హంగామాలు , భారీ సెట్టింగులు లాంటివి ఏమీ లేకుండా సింపుల్ గా ఓ అపార్ట్మెంటులో లాగించేసారు
ఇక సైకో పోలీస్ పాత్రలకు రాజా రవీంద్ర పెట్టింది పేరు
ఈ సినిమాలో కూడా సైకో పోలీస్ పాత్రలో రాణించాడు
వీకే నరేష్ , రాజా రవీంద్ర మధ్య సంబాషణలు బాగున్నాయి
శాంతి పాత్రలో నటించిన హీరోయిన్ కామాక్షి భాస్కర్ల నటన పర్లేదు
శేఖర్ చంద్ర అందించిన సంగీతం బావుంది
ఫస్ట్ హాఫ్ లో కొంత సాగతీత మినహా దర్శకుడి ప్రయోగం బానే ఉంది
ఫైనల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకునేవారు ఈ సినిమాని ప్రయత్నించవచ్చు !
రేటింగ్ 3 / 5
పరేష్ తుర్లపాటి