Home » మంచు తుఫానులో కూడా శ్రీదేవి షూటింగులో పాల్గొంది .. నటన పట్ల శ్రీదేవికి ఉన్న డెడికేషన్ అలాంటిది – అనుపమ్ ఖేర్

మంచు తుఫానులో కూడా శ్రీదేవి షూటింగులో పాల్గొంది .. నటన పట్ల శ్రీదేవికి ఉన్న డెడికేషన్ అలాంటిది – అనుపమ్ ఖేర్

Spread the love

చలికాలం మాములు వాతావరణంలోనే వెచ్చటి జెర్కిన్ ఒంటిమీద కప్పుకుని కానీ బయటికి రాలేము

అలాంటిది ఏకంగా మైనస్ డిగ్రీలు ఉన్న స్విట్జర్లాండ్ మంచు పర్వతాల్లో నడవాలంటే ఎన్ని జర్కిన్లు కప్పుకోవాలి? .. ఎన్ని రగ్గులు కప్పుకోవాలి ?

కానీ నటన మీద డెడికేషన్ ఉన్న శ్రీదేవి మాత్రం గడ్డకట్టించే మంచు పర్వతాల్లో దర్శకుడి సూచనల మేరకు కేవలం షిఫాన్ చీర కట్టుకుని ఓ సాంగ్ షూటింగులో పాల్గొంది

ప్రస్తుతం స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ విషయాన్ని చెప్పాడు

ఓసారి స్విట్జర్లాండ్ లోని అత్యంత ఎత్తైన జంగ్ ప్రాప్ మంచు పర్వత ప్రాంతాల్లో యాష్ చోప్రా సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు జరిగాయి

అయితే ఇక్కడ శ్రీదేవి మీద సాంగ్ చిత్రీకరిస్తున్నారు . పాటకు తగ్గట్టుగా ఉండాలని దర్శకుడు శ్రీదేవిని షిఫాన్ చీర ధరించమని చెప్పాడు

అప్పటికే షూటింగ్ స్పాట్ లో ఉన్న యూనిట్ అందరూ ఒంటినిండా రగ్గులు కప్పుకుని గజగజా వణుకుతున్నాం

నాకైతే ఎటువంటి రగ్గులు లేకుండా కేవలం షిఫాన్ చీరలో శ్రీదేవి షూటింగులో పాల్గొనటం అసాధ్యం అనిపించింది

కానీ ఆశ్చర్యం గా శ్రీదేవి షూటింగుకి ఓకే చెప్పింది

ఆ క్షణాన శ్రీదేవి డెడికేషన్ చూసి మేమంతా ఆశ్చర్య పోయాం

మైనస్ డిగ్రీల చలి ఒణికిస్తున్నా ముఖంలో ఆ భావాన్ని బయటికి కనిపించకుండా శ్రీదేవి సాంగ్ మొత్తం ఓకే చేసింది

ఇంకా చెప్పాలంటే శ్రీదేవి మీద సాంగ్ చిత్రీకరిస్తున్న కెమెరామెన్ , డైరెక్టర్ , ఇతర యూనిట్ సభ్యులు అందరూ ఒక్కొక్కళ్ళు నాలుగైదు రగ్గులు కప్పుకుని షూట్ చేసారు

షూటింగ్ పూర్తికాగానే శ్రీదేవి పరుగున వెళ్లి తాను కూడా నాలుగు రగ్గులు కప్పుకుంది .. అది వేరే విషయం .. కానీ సాంగ్ షూటింగ్ జరుగుతున్నంతసేపూ చలిని పంటిబిగువున భరించి చక్కటి హావభావాలను ప్రదర్శించిన శ్రీదేవిలోని నటికి హ్యాట్సాఫ్ అన్నాడు అనుపమ్ ఖేర్

ఈ సందర్భంగా అయన ఇండియన్ దర్శకుల గొప్పతనాన్ని గురించి కూడా చెప్పాడు

బాలీవుడ్ దర్శకుడు యాష్ చోప్రా తన సినిమాలు చాలావరకు స్విట్జర్లాండ్ లోనే షూటింగులు చేసేవాడు

యాష్ చోప్రా తీసిన సిల్సిలా , చాందిని , దిల్ వాలే దుల్హనియా లాంటి హిట్ సినిమాలను అధికభాగం స్విట్జర్లాండ్ లోనే చిత్రీకరించాడు

అందుకే ఈ రోజుకీ స్విట్జర్లాండ్ లో మంచు పర్వతాలు , అందమైన ప్రదేశాల్లో యాష్ చోప్రా ముద్ర కనిపిస్తుంది

ఎంతలా అంటే ఆ దేశ ప్రజలు సైతం యాష్ చోప్రాను ఓన్ చేసుకునేంత

గతంలో యాష్ చోప్రా చేసిన షూటింగులకు జ్ఞాపకార్థముగా పర్వత ప్రాంతాలను కలిపే ఓ ట్రైన్ కు యాష్ చోప్రా ట్రైన్ అని నామకరణం చేసారు

ఇది స్విట్జర్లాండ్ లో భారతీయ దర్శకుడికి దక్కిన అత్యున్నత పురస్కారం అని అనుపమ్ ఖేర్ ప్రశంసించారు !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *