పశువుల కాపరినుంచి పీహెచ్డీ దాకా !
నాగర్ కర్నూల్ జిల్లా కొండనాగుల గ్రామానికి చెందిన చింతా పరమేష్ తన 13 వ ఏట దాకా అసలు బడికే వెళ్ళలేదు
అటువంటివాడు ఏకంగా పీహెచ్డీ చేసాడంటే నమ్ముతారా ?
ఎస్ .. ఇది నమ్మలేని నిజం
కృషి , పట్టుదల ఉంటె సాధ్యం కానిది అంటూ ఏముండదని చింతా పరమేష్ నిరూపించాడు
కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పరమేష్ తన తొమ్మిదో ఏటనే బడి చదువులకు దూరం అయ్యాడు
ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం పశువులను కాయటానికే సరిపోయింది
అలా నాలుగేళ్లపాటు పశువుల కాపరిగా పనిచేసాడు
అతడికి చదువుకోవాలని ఉంది కానీ పని మానేస్తే కుటుంబం గడవడానికి కష్టం అవడంతో పాటు చదువులకు అయ్యే ఖర్చులను భరించే స్తొమత కూడా లేక ఆ ఆలోచన విరమించుకున్నాడు
సరిగ్గా ఇదే సమయంలో చింతా పరమేష్ ఓ స్వచ్ఛంద సంస్థ కంట్లో పడ్డాడు
చదువు మీద అతడికున్న ఆసక్తిని గమనించి అండగా నిలబడటానికి ముందుకొచ్చారు
దానితో పరమేష్ జీవితం మలుపు తిరిగింది
స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఆసరాతో అతడు బడి చదువులనుంచి పీజీ వరకు మంచి మార్కులతో చదువులు పూర్తిచేసాడు
ఉస్మానియాలో జియాలజీలో మాస్టర్స్ చేసి అదే యూనివర్సిటీలో పీహెచ్డీ సీటు పొందాడు
భూగర్భ జలాలపై అతడు చేసిన పరిశోధనలకు డాక్టరేట్ కూడా లభించింది
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా చింతా పరమేష్ పట్టుదలతో చదువుకుని పీహెచ్డీ సాధించి డాక్టరేట్ కూడా పొందటంతో సీఎం రేవంత్ రెడ్డి అతడిపై ప్రశంసలు కురిపించారు !