తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా లక్షలాది అభిమానులను సంపాదించుకున్న తలపతి విజయ్ ఇప్పుడు తన రాజకీయ జీవితంతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు.
ఆయన “తమిళగ వెట్రి కళగం” అనే రాజకీయ పార్టీని ప్రారంభించి, రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే . రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి తాను సినిమా నుండి రిటైర్ అవుతున్నానని, ‘జన నాయగన్’ తన చివరి చిత్రం అని కూడా ఆయన ప్రకటించారు.
అయితే విజయ్ తన కార్ల నుండి ఇటీవల కొనుగోలు చేసిన ప్రచార బస్సు వరకు ప్రతిదానిపై ఒకే నంబర్ ప్లేట్‌ను ఉపయోగించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
స్వతహాగా విజయ్ కి మార్కెట్లోకి వచ్చిన అత్యంత ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం ముందునుంచీ అలవాటు .
అతను తన పాత రోల్స్ రాయిస్‌ను అమ్మిన తర్వాత, గత సంవత్సరంలో మూడు కొత్త కార్లను కొనుగోలు చేశాడు. వీటిలో BMW ఎలక్ట్రిక్ కారు, లెక్సస్ LM కారు మరియు టయోటా యొక్క లగ్జరీ మోడల్, వేల్ ఫైర్ ఉన్నాయి.
ఇవి మాత్రమే కాదు, తమిళనాడు అంతటా రాజకీయ ప్రచారం కోసం ఆయన ప్రత్యేక బస్సు కూడా కొనుగోలు చేసారు . ఆశ్చర్యకరంగా, ఈ కార్లు , బస్సు , వీటన్నింటికీ ఒకే నంబర్, “0277” కనిపిస్తుంది.
ఆ నంబర్లు వరుసగా TN 14 AH 0277 (BMW), TN 14 AL 0277 (Lexus), TN 14 AM 0277 (Vellfire), మరియు TN 14 AS 0277 (TVK ప్రచార బస్సు)గా రిజిస్ట్రేషన్ నుంబర్లతో నమోదు చేయబడ్డాయి.
జాగ్రత్తగా గమనిస్తే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్లు అన్నిటిలోనూ 14-02-77 అనే తేదీని సూచించే విధంగా ఉంటుంది . ఈ విధంగా విజయ్ తన అన్ని వాహనాలకు ఒకే నెంబర్ తీసుకోవడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది.
అందుకు కారకురాలు అతడి చెల్లెలు విద్య
చిన్న వయసులోనే మరణించిన ఆమె సోదరి పుట్టినరోజు 14-02-77. చెల్లితో తనకున్న అనుబంధానికి గుర్తుగా ఆమె జ్ఞాపకార్థం విజయ్ తన అన్ని వాహనాలపై ఆ నంబర్‌ను ఉపయోగిస్తున్నాడు. దీనిని చూసిన ఆయన అభిమానులు “తలపతి తన సోదరి పట్ల తనకున్న ప్రేమను ఈ రకంగా గుండెల్లో పెట్టుకున్నాడు” అని గర్వంగా ప్రశంసిస్తున్నారు
