
ఆఖరికి అఖిల్ పెళ్లి మీద కూడా ట్రోలింగులు ఏంటి భయ్యా..?
నాగార్జున టైం ఏంటో కానీ ఈ మధ్య ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని నెటిజన్ల ట్రోలింగ్ కు ముడి సరుకు అవుతున్నాడు
నాగ చైతన్య.. సమంతల విడాకుల సమయంలో నాగార్జున కుటుంబం మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది
సమంతకు మద్దతుగా నెటిజన్లు నాగార్జున.. నాగ చైతన్య ల మీద విమర్శలు గుప్పించారు
సమంత సంయమనంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో వివాదం సద్దుమణిగింది
దరిమిలా నాగ చైతన్య..ధూళిపాళ్ల శోభిత పెళ్లి జరిగి అంతా సద్దుమణిగింది అనుకునే టైములో తెలంగాణా మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబం మీద సంచలన ఆరోపణలు చేయడంతో మరోసారి బిగ్ బాస్ వార్తల్లో నిలిచాడు
సమంత విషయంలో కేటీఆర్ అనుచితంగా ప్రవర్తించాడని.. ఈ విషయాలు నాగార్జునకు తెలిసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపణలు చేసారు
దీంతో నాగార్జున మంత్రి మీద పరువునష్టం దావా వేశారు
ఇదిలా ఉండగా హైడ్రా దెబ్బ మొదటిసారిగా నాగార్జున మీదే పడింది
నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది
ఇటువంటి పరిస్థితుల్లో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కి శ్రేయా తో పెళ్లి ఖరారు అయ్యింది
అఖిల్ నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేసారు
కానీ అనుకోకుండా నాగార్జున మీద ఇంకో ఎదురు దెబ్బ పడింది
శ్రేయా తో అఖిల్ పెళ్లి రద్దు అయ్యింది
దాంతో అక్కినేని వారింట శుభకార్యాలకు కొంత గ్యాప్ వచ్చింది
ఇదిగో ఇన్నాళ్ళకు అక్కినేని వారింట మళ్ళీ కళ్యాణ గంట మోగింది
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ముఖ్యమంత్రితో వచ్చిన విభేదాలను సైతం పక్కనబెట్టి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి శుభలేఖ ఇచ్చి కొడుకు పెళ్లికి ఆహ్వానించాడు నాగార్జున
అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా సినీ ప్రముఖులను అందర్నీ స్వయంగా పిలుపులకు వెళ్ళి పెళ్లికి ఆహ్వానించాడు
అఖిల్ పెళ్లి ముంబైకి చెందిన పారిశ్రామిక వేత్త జైనాబ్ తో నిన్న శుక్రవారం తెల్లవారు ఝామున నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యులు.. సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది
ఈ వివాహ వేడుకకు చిరంజీవి.. రాజమౌళి.. ప్రశాంత్ నీల్ తదితరులు కుటుంబ సభ్యులతో సహా హాజరు అయ్యారు
అఖిల్ పెళ్లి వేదిక వద్దకు స్వయంగా కారు నడుపుకుంటూ వస్తే కుటుంబ సభ్యులు గేట్ వద్ద నుంచి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు
అన్న నాగ చైతన్య బారాత్ డాన్స్ చేస్తూ తమ్ముడికి స్వాగతం పలకడం హైలెట్
ఈ మధ్య కాలంలో నాగార్జునకు సంతోషం కలిగించిన క్షణాలు ఇవే
రామ్ చరణ్.. సుమంత్ తదితరులు పెళ్ళిలో స్టెప్పులు వేసి అతిథుల్లో జోష్ నింపడం పలువురిని ఆకట్టుకుంది
ఈనెల ఎనిమిదిన అన్నపూర్ణా స్టూడియోలో అఖిల్ వివాహ రిసెప్షన్ ను ఏర్పాటు చేసారు
బహుశా రాజకీయ.. సినీ ప్రముఖులు రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశం ఉంది
ఇంత చక్కగా అఖిల్ పెళ్లి వేడుకలు జరుగుతుంటే కొంతమంది నెటిజన్లు మాత్రం యథాప్రకారం ఈసారి కూడా నాగార్జున మీద ట్రోలింగ్ చేసారు
లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ వెటకారాలు చేసారు
ప్రస్తుతం అఖిల్ వయసు 31 కాగా ఆమెకంటే ఎనిమిదేళ్లు పెద్ద అయిన 39 ఏళ్ల జైనాబ్ ను పెళ్లిచేసుకోవడం ఈ ట్రోలింగ్లకు కారణం
భయ్యా.. వాళ్ళ ఏజ్ ఎంత అయితే మనకెందుకు?
ఇద్దరూ ఇష్టపడ్డారు..పెళ్లిచేసుకున్నారు
వీలుంటే నాలుగు అక్షింతలు వేసి నూతన జంటను ఆశీర్వదిద్దాం
Wish you a happy wedding life akkineni Akhil and zainab 🌹🌹
పరేష్ తుర్లపాటి ✍️