Home » ఇంతకీ రైల్వే కాలనీ లో ఏముంది ?

ఇంతకీ రైల్వే కాలనీ లో ఏముంది ?

Spread the love

సస్పెన్స్ , థ్రిల్లర్ జానర్ స్టోరీల్లో ఒకట్రెండు ట్విస్టులు ఉండటం బానే కిక్కిస్తుంది కానీ అదే పనిగా ట్విస్టులతో బాదేస్తే ప్రేక్షకులకు కక్కు వస్తుంది
రైల్వే కాలనీ లో దర్శకుడు చేసిన పొరపాటు అదే

స్టోరీ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఎక్కువ ట్విస్టులు పెడితే ఎక్కువ కిక్ వస్తుంది అనుకున్నాడు

ఓ హత్య కేసులో రకరకాల ట్విస్టులతో కధనాన్ని ప్రెజెంట్ చేస్తూ హీరోయిన్ పాత్రను , ఆమె తల్లి పాత్రను చంపేసి థియేటర్లో కూర్చుని చూస్తున్న ప్రేక్షకుల సహనాన్ని కూడా చంపేశాడు

సీన్ థ్రిల్ ఇవ్వాల్సింది పోయి సీన్ కిల్ అయిపొయింది

సరే 12 a రైల్వే కాలనిలో ఏముందో ఇప్పుడు చూద్దాం ?

ఈ సినిమాలో అల్లరి నరేష్ (కార్తీక్ ) రైల్వే కాలనీ లో ఉంటాడు కాబట్టి టైటిల్ కూడా అదే ఖాయం చేయబడింది

ఫ్రెండ్స్ తో కలిసి అల్లరిచిల్లరిగా తిరిగే కార్తీక్ వరంగల్ ఎమ్మెల్యే టిల్లు (జీవన్) కి నమ్మిన బంటు

ఈ టిల్లు కూడా అట్లాంటి ఇట్లాంటి టిల్లు కాదు
ఆల్రెడీ రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయి మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతుంటాడు

ఓ ఆటల పోటీల సందర్భంగా ఆరాధనను ( కామాక్షి భాస్కర్ల ) ను చూసి కార్తీక్ మనసు పారేసుకుంటాడు

అల్లరిచిల్లరిగా తిరిగే హీరోనే హీరోయిన్ లవ్ చేస్తుందనే తెలుగు సినిమా సంప్రదాయం ప్రకారం ఇందులో కూడా పైకి కోపం నటిస్తూ ఆరాధన కూడా కార్తీక్ మీద మనసు పారేసుకుంటుంది

ఇక్కడ కాసేపు ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది

ఓ రోజు టిల్లు కార్తీక్ కి ఓ కవర్ ఇచ్చి దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టమని చెప్తాడు

పోలీసులు రావడంతో కార్తీక్ ఆ కవర్ తీసుకుని దొంగతనంగా ఆరాధన ఇంట్లోకి ప్రవేశిస్తాడు
అక్కడ కార్తీక్ కి ఊహించని పరిణామం ఎదురౌతుంది

అప్పటిదాకా కింది గదిలో మాట్లాడిన ఆరాధన పై గదిలో తల్లితో సహా హత్య చేయబడుతుంది

ఈ హత్యతో ప్రేక్షకులతో పాటు కార్తీక్ కూడా షాక్ అవుతాడు

అసలు ఆరాధన నేపధ్యం ఏంటి ?
తల్లీకూతుళ్లను ఇద్దరినీ కలిపి ఎవరు హత్య చేసారు ?
ఈ హత్య కేసు చిక్కుముడి ఎలా వీడుతుంది? అనేది మిగతా కధలో తెలుస్తుంది

సినిమా ఎలా ఉందంటే ?

పైన చెప్పినట్టుగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో కథ రాసుకున్నప్పుడు ఒకట్రెండు ట్విస్టులు ఉండటం కామనే

కానీ ఆ కామన్ ని బ్రేక్ చేసి ట్విస్టులతో చంపేయాలని సరికొత్త నిర్ణయం తీసుకోవడంతో ఎడాపెడా కనిపించిన ట్విస్టులతో ప్రేక్షకులకు ఊపిరి అందనీయకుండా చేయడం ఆఖర్లో పెద్ద ట్విస్ట్

దారంలో చిక్కుముడులు ఉన్నప్పుడు దాన్ని విప్పదీయడం కూడా మనకు తెలిసి ఉండాలి
అదేపనిగా దారంలో చిక్కుముడులను మాత్రమే చూపించడం అనర్థదాయకం కూడా

మరోపక్క ఆ దారం ఎప్పుడు ముడులు విప్పుకుని బయటికి వస్తుందా అని ఎదురు చూసీ చూసీ ప్రేక్షకుడు కూడా చిక్కుముడిలో ఇరుక్కుపోయాడు

సస్పెన్స్ థ్రిల్లర్ కథను యెంత బాగా రాసుకున్నా వెండి తెర మీద నడిపించే కధనంలో చూడగానే ఆసక్తిని రేకెత్తించేలా ఉండాలి

ఈ సినిమా కోసం రాసుకున్న కథని సిల్వర్ స్క్రీన్ మీద సరిగా ప్రెజెంట్ చేయలేకపోయారనిపిస్తుంది

మొదటి భాగం అంతా టైటిల్ కోసం రైల్వే కాలనీ చూపించడంతోనే సరిపోయింది

హీరో ఫ్రెండ్స్ తో అల్లరిచిల్లరగా తిరగడం , కాసేపు హీరోయిన్ ప్రేమలో పడటం , వరంగల్ ఎమ్మెల్యే గొడవలతోనే సరిపోయింది

హీరో పక్కన ముగ్గురు జబర్దస్త్ బాబులలాంటి కామెడీ యాక్టర్లను పెట్టి కితకితలు పెడితే నవ్వుతారు అనుకున్నారు .. నవ్వకపోగా చాలామంది ఏడ్చారు

హాస్యం కాస్తా అపహాస్యం పాలయ్యింది

ఇక ఈ మధ్య ప్రతి సినిమాలో తెలంగాణా యాసలో డైలాగులు చెప్పించటానికి దర్శకులు నానాతంటాలు పడుతున్నారు

అలా తెలంగాణ యాసలో డైలాగులు పలికిస్తే సెంటిమెంటుకి కరిగిపోయి తెలంగాణాలో కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందనే ఆలోచన మంచిదే కానీ తెలంగాణా యాస పేరుతో కిచిడి యాసలో డైలాగులు పలికిస్తే ప్రేక్షకులకు డౌన్ లో మండే అవకాశాలు ఉన్నాయి

ఈ సినిమాలో కూడా తెలంగాణ యాసలో పలికించిన డైలాగులు ఎబ్బెట్టుగా ఉన్నాయి

ఇక సినిమా సెకండాఫ్ కు వచ్చేసరికి హత్య కేసులో ఇన్వెస్టిగేషన్ మొదలవడంతో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ తో కొద్దిగా ఎగ్జైట్ అవుతాం

అదీ కాసేపే

సస్పెన్స్ బాగా వేపుదామని ట్విస్టుల మీద ట్విస్టులు పెట్టడంతో కథ బబుల్ గం లా సాగిపోయిందే కానీ ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వలేదు

ఎవరెలా చేసారు ?

కామెడీ జానర్ లో అత్యుత్తమ నటుడిగా అల్లరి నరేష్ ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు

కానీ ఈ మధ్య నాంది , ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం లాంటి సినిమాల్లో సీరియస్ పాత్రలు పోషించి , కామెడీనే కాదు ఏ జానర్ లో అయినా చక్కటి నటనను ప్రదర్శించగలడు అని పేరు తెచ్చుకున్నాడు

రైల్వే కాలనీ లో కూడా నటన పరంగా నరేష్ మెప్పించాడు

ఆరాధనగా కామాక్షి నటన కూడా పర్లేదు
కధలో కీలకమైన పాత్ర దక్కింది

గెటప్ శ్రీను , వైవా హర్ష , సద్దాం కామెడీలకి కితకితలు పెట్టుకున్నా నవ్వు రాలేదు.. దురదృష్టం

పొలిమేర సిరీస్ తీసి మెప్పించిన అనిల్ విశ్వనాధ్ ఈ సినిమాకి కథ రాసుకుని షో రన్నర్ గా వ్యవహరించారు

కధలో లోపంకన్నా కధనంలోనే లోపాలు ఉన్నాయనిపిస్తోంది

కధనాన్నిథ్రిల్లింగ్ గా నడిపించడంలో దర్శకుడు తడబడినట్టు కనిపిస్తుంది
సాంకేతిక అంశాల్లో భీమ్స్ సంగీతం పర్లేదు

నటీనటులు : అల్లరి నరేష్ , కామాక్షి భాస్కర్ల , సాయి కుమార్ , జీవన్ తదితరులు
నిర్మాత : శ్రీనివాస్ చిట్టూరి
దర్శకుడు :నాని కాసరగడ్డ
విడుదల : 21 – 11 – 2025
రేటింగ్ : 2 / 5


Spread the love

2 thoughts on “ఇంతకీ రైల్వే కాలనీ లో ఏముంది ?

  1. Excellent post. I was checking continuously this blog and I
    am impressed! Extremely helpful information specially the last part :
    ) I care for such info much. I was seeking this certain information for a very
    long time. Thank you and good luck.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!