8 వసంతాలు !

Spread the love

8 వసంతాలు

ఒకే ప్రేమ కథను తీసే దర్శకుడి అభిరుచి మేరకు చూసే ప్రేక్షకులకు రకరకాలుగా కనిపిస్తుంది

ఇదే కథను కె రాఘవేంద్రరావు ఒకలా తీస్తాడు .. బోయపాటి మరోలా తీస్తాడు

రాఘవేంద్రరావు అయితే ఇంట్రవెల్ ముందు మూడు తర్వాత మూడు పాటలు పెట్టి ప్రేక్షకులను కథతో పాటు పరిగెత్తించగలడు

అదే బోయపాటి అయితే ప్రేమ కధకు కొద్దిగా వయొలెన్స్ ను జోడించి క్లాసు , మాసు ఆడియన్స్ ని మెప్పించగలడు

అలాగే 8 వసంతాలు సినిమా తీసిన దర్శకుడు ఫణీంద్ర కథను తనదైన పొయెటిక్ స్టైల్ లో స్క్రీన్ ప్రెజెంట్ చేసాడు

పొయెటిక్ స్టైల్ లో భావం చాలా లోతుగా ఉంటుంది

మాస్ కు వెంటనే ఎక్కకపోయినా క్లాస్ ఆడియన్స్ కు మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది

ఒక విధంగా 8 వసంతాలు లో ఒక కవి హృదయ ఆవిష్కరణ కనిపిస్తుంది

అందుకే ఈ సినిమాలో డైలాగులు కొంచెం డెప్త్ లో ఉండి ఆలోచింపచేస్తాయి

ఇక కథ విషయానికి వస్తే గతంలో వచ్చిన కొన్ని సినిమాల్లో మాదిరే ఇందులో కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కనిపిస్తుంది

శుద్ధి అయోధ్య ( సనంతిక సనీల్ కుమార్ ) ( హీరోయిన్ కు ఇలాంటి పేరు పెట్టడం వెనుక కూడా దర్శకుడి పొయెటిక్ ఆలోచన ఉందేమో ) రచయిత్రి

ఈ నేపథ్యంలో ఊటీలో ఉంటూనే ఈమె బోలెడు రచనలు చేసి అభిమానులను సంపాదించుకుంటుంది

ట్రావెల్స్ చేయడం , మార్షల్ ఆర్ట్స్ వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్న శుద్ధి జీవితంలోకి అమెరికా నుంచి వరుణ్ ( హనురెడ్డి ) వస్తాడు

ఇద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది

అలా వీరి ప్రేమ ప్రయాణం సాఫీగా సాగిపోతున్న సమయంలో శుద్ధిని విడిచిపెట్టి వరుణ్ అమెరికా వెళ్ళిపోతాడు

ఇంతవరకు ప్రధమార్ధంలో కథ వేగంగా సాగిపోతుంది

శుద్ధి హావభావాలతో ఆకట్టుకుంటుంది
వరుణ్ పాత్రలో హనురెడ్డి కూడా చక్కగా నటించాడు

ఈ దశలో సెకండాఫ్ లో శుద్ధి జీవితంలోకి సంజయ్ ప్రవేశిస్తాడు

దీనితో శుద్ధి ప్రేమ ప్రయాణం కొత్త మలుపు తిరుగుతుంది

ఇక్కడ్నుంచి స్టోరీ ట్రయాంగిల్ గా మారిపోతుంది

అమెరికా వెళ్ళిపోయిన వరుణ్ శుద్ధి కోసం తిరిగి వస్తాడా ?

శుద్ధికి దగ్గరైన సంజయ్ ఎవరు ? లాంటి ప్రశ్నలతో 8 వసంతాల కధనం నడుస్తుంది

చివరకు శుద్ధి ప్రేమ ప్రయాణంలో ముగింపు ఏంటో అనేది చిత్రంలో చూసి తెలుసుకోవాల్సిందే

ఇక సినిమా ఎలా ఉందంటే ముందే చెప్పినట్టు పొయెటిక్ గా ఉంటుంది

దర్శకుడు ఫణీంద్ర 8 వసంతాలు ఓ దృశ్య కావ్యంగా మలచటానికి చక్కటి ప్రయత్నం చేసాడు

గతంలో షార్ట్ ఫిలిం చేసిన అనుభవం ఉన్న ఫణీంద్ర మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ చేతిలో పడటం ఆశర్యమే

బహుశా కథ మీద అతడికున్న నమ్మకం మైత్రీ మూవీ మేకర్స్ ను కూడా కన్విన్స్ చేసిందేమో

అయితే ఫణీంద్ర చక్కటి కథనే రాసుకున్నాడు కానీ కధనాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే సందర్భంలో భావుకతను మాత్రమే దృష్టిలో పెట్టుకుని భావోద్వేగాల్ని మర్చిపోయాడు

సనంతిక నటన విషయంలో చక్కటి ప్రతిభ ప్రదర్శించింది కాబట్టి సరిపోయింది

దర్శకుడు ఆ అమ్మాయితో మరింత బాగా భావోద్వేగాల్ని పలికించవచ్చు

ఆ లోపం కొద్దిగా ఉంది

ప్రధమార్ధంలో శుద్ధి ,వరుణ్ ల మధ్య ప్రేమ సన్నివేశాలను చకచకా లాగించి కధలో ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు సెకండాఫ్ లో కొద్దిగా తడబడ్డాడు

ఆ తడబాటులో సంజయ్ , శుద్ధి ల మధ్య రిలేషన్ సరిగా ఎస్టాబ్లిష్ అవలేదు

దానితో అప్పటిదాకా హుషారుగా సాగిన కధనం ఒక్కసారిగా వీక్ అయిపొయింది

ఇక ఈ సినిమాలో ఎవరెలా చేసారంటే ముందుగా చెప్పుకోవాల్సింది శుద్ధి పాత్ర చేసిన సనంతిక గురించే చెప్పుకోవాలి

అందం , హావభావాలతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది

లవర్ బాయ్ గా నటించిన హను రెడ్డిలో ఛార్మింగ్ ఉంది
ప్రేమ పాత్రకు సరిగ్గా సరిపోయాడు

రెండో హీరో రవి దుగ్గిరాల కూడా తన పాత్రకు న్యాయం చేసాడు

సాంకేతికత విషయానికి వస్తే ఊటీ , కాశ్మీర్ అందాలను మరింత అందంగా చూపించిన కెమెరా పనితనం బాగుంది

హేషామ్ సంగీతం కూడా బావుంది

సినిమాలో కొన్ని డైలాగులు మనసును టచ్ చేస్తాయి

అయితే అందులో పొయెటిక్ భావనలు ఎక్కువగా ఉండటంతో మాస్ ఆడియన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది సందేహమే !

రేటింగ్ 2. 5 / 5

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!