Home » “నా రాజాని వదిలి ఉండలేకే బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేశా – దివ్వెల మాధురి” ( మంచి పరిణామం – BB ప్రేక్షకుల ఇన్నర్ వాయిస్ )

“నా రాజాని వదిలి ఉండలేకే బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేశా – దివ్వెల మాధురి” ( మంచి పరిణామం – BB ప్రేక్షకుల ఇన్నర్ వాయిస్ )

Spread the love

“నా రాజాని వదిలి ఉండలేకే బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేశా – దివ్వెల మాధురి”

( మంచి పరిణామం – BB ప్రేక్షకుల ఇన్నర్ వాయిస్ )

గత కొద్దినెలలుగా అభినవ సీనియర్ ప్రేమ జంట దువ్వాడ శ్రీను , దివ్వెల మాధురిల లవ్ స్టోరీ ఎపిసోడ్స్ టీవీల్లోనూ , సోషల్ మీడియాలోనూ బాల ప్రేమ పావురాలను ఓలలాడిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే

దువ్వాడ శ్రీను వైసీపీ నాయకుడిగా ఎమెల్సీగా ఉన్నప్పుడే వీరి ప్రేమకు బీజం పడింది ( వీరి ప్రేమ తట్టుకోలేక ఈ మధ్య వైసీపీ కూడా ఆయన్ను పార్టీనుంచి సస్పెండ్ చేసిందిలెండి )

ఈ విషయం కాస్తా దువ్వాడ శ్రీను భార్యకు , దివ్వెల మాధురి భర్తకు తెలియటంతో ఇద్దరూ వేరు వేరుగా స్పందించారు

దువ్వాడ శ్రీను భార్య ఆయన ఇంటి ఎదురుగా దీక్షకు కూర్చుని న్యాయం కావాలి అని పోరాటం చేయగా , అమెరికాలో ఉన్న దివ్వెల మాధురి భర్త మాత్రం పెద్ద మనసు చేసుకుని క్షమించేసాడు

ముందుగా స్నేహితులం అని చెప్పిన ప్రేమికుల జంట తమ మాజీ భార్య / భర్తతో సెటిల్మెంట్లు అయిపోయిన తర్వాత ప్రేమికులం అని చెప్పేసారు

ఇక అప్పటినుంచి వీరి ప్రేమకు ఎదురే లేకపోయింది

సోషల్ మీడియాలో రోజుకో వీడియో వదుల్తూ ప్రేమ జంట హల్చల్ చేసారు

ఈ క్రమంలో తిరుమలలో దివ్వెల మాధురి ఫోటో షూట్ వివాదాస్పదం అయ్యింది కూడా

దువ్వాడ శ్రీను పుట్టినరోజుకి కేక్ కట్ చేస్తూ అతడికి ముద్దు పెట్టి జూనియర్ దువ్వాడను కనాలని ఉందని బహిరంగంగా తన ప్రేమను వ్యక్తపరిచింది మాధురి

తెలుగు సీరియల్ మాదిరి సోషల్ మీడియాలో రోజుకో ఎపిసోడ్ వీడియోల రూపంలో వదిలిన ఈ ప్రేమ జంటను చూసి బిగ్ బాస్ టీమ్ కు కూడా గుబులు పుట్టినట్టుంది

వెంటనే మొన్న సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం అయిన బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసేందుకు బిగ్ బాస్ ఆఫీస్ టీమ్ ఆవిడ్ని కాంటాక్ట్ చేసారు

కానీ ఆవిడ ప్రేమ ముందు వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోయారు

‘ మాములుగా నా రాజాను విడిచి నేను క్షణం ఉండలేను .. అలాంటిది అన్ని రోజులు ఆయన్ని ఒంటరిగా వదిలేసి హౌస్ లోకి రావడమా ? నెవ్వర్ .. అందుకే మీ ఆఫర్ను రిజెక్ట్ చేస్తున్నా .. ఏమనుకోకండే ‘ అని చెప్పేసింది

ఎలాగైనా ఆమెను ఒప్పించాలని దువ్వాడ శ్రీను వైపు నుంచి కూడా బిగ్ బాస్ టీమ్ ప్రయత్నం చేసినట్టు సమాచారం

అయితే దువ్వాడ శ్రీను కూడా దివ్వెల మాధురి చెప్పినట్టుగానే చెప్పి వాళ్ళని షాక్ కు గురిచేశాడు

‘ బిగ్ బాస్ టీమ్ దివ్వెల మాధురిని హౌస్ లోకి పంపాలని స్వయంగా వచ్చి అడిగిన మాట వాస్తవం .. అయితే ఆవిడతో నేను కలిసి చెయ్యాల్సిన పనులు కొన్ని ఉన్నాయి .. అందువల్ల ఈ ఆఫర్ ను వదులుకుంది ‘ అని వేరే సందర్భంలో ఆయన చెప్పారు

ఏది ఏమైనా గత కొద్ది నెలలుగా తమ వీడియోలతో సంచలనం సృష్టిస్తున్న ఈ ప్రేమ జంట సీజన్ 9 ముగిసేలోపు వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారని వారి అభిమానుల టాక్ !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *