పెళ్లికాని ప్రసాదులు పడే కష్టాలే ‘ ఈసారైనా ‘
సంబంధం చూసేటప్పుడు తమ పిల్లను చేసుకోబేయే పిల్లవాడు గవర్నమెంట్ జాబ్ చేస్తుండాలి అనీ .. ఆ కుటుంబం బాగా స్థితిమంతులు అయి ఉండాలనీ , సాధ్యమైనంతవరకు చిన్న కుటుంబం అయి ఉండాలనీ ఇలా కొన్నిరకాల పారామీటర్స్ పెట్టుకుని వరుడి కోసం వెతుకుతారు ఆడపిల్ల తల్లితండ్రులు ఇప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్స్ వచ్చాక ప్యాకేజీల మోజులో పడ్డారు కానీ ఒకప్పుడు సంబంధాల విషయంలో గవర్నమెంట్ జాబే క్రైటీరియా గా ఉండేది ఈ పరిస్థితి పెళ్లికాని ప్రసాదులకు ఇబ్బందిగా ఉండేది…
