నూటికో కోటికో ఒక్కరు అది మీరే మీరే సారు .. వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్ .. !
అందరిలా ప్రతి చిన్న సమస్యకు ప్రభుత్వాలను నిందిస్తూ ఖాళీగా కూర్చోలేదు ఆ పెద్దాయన
సమస్య పరిష్కారం కోసం తన వంతుగా నడుం బిగించి అడుగు ముందుకు వేసాడు
ఆయన వేసిన ఆ ఒక్క అడుగు కొన్ని లక్షలమందికి ఖచ్చితంగా స్ఫూర్తిని ఇస్తుంది
అలా అని ఆ స్ఫూర్తిప్రదాత నవయువకుడేమీ కాదు
88 ఏళ్ళ రిటైర్డ్ పోలీస్ అధికారి
స్ఫూర్తి ప్రదాత గురించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ( X ) వేదికగా స్పందించారు
చండీఘడ్ కు చెందిన 88 ఏళ్ళ ఇంద్రజిత్ సింగ్ సిద్దు 1964 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి
పదవీ విరమణ అనంతరం చండీఘడ్ లో విశ్రాంత జీవనం గడుపుతున్నారు
పదవీ విరమణ అనేది ఉద్యోగానికే కానీ బాధ్యతలకు కాదు అని 88 ఏళ్ళ వయసులో ఆ పెద్దాయన ఓ కొత్త బాధ్యతను భుజానికెత్తుకున్నాడు
అదే రోడ్ల మీద చెత్తను ఊడ్చి శుభ్రం చేయడం
ఆ వయసులో ఆయన అలా రోడ్లను శుభ్రం చేయడం వెనుక ఓ కారణం ఉంది
స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో చండీఘడ్ ర్యాంకు పడిపోయిందని తెలిసి చాలా బాధ పడ్డాడు
ఇది ప్రభుత్వాల పనో .. ప్రజల పనో అని ఇతరులను నిందిస్తూ కూర్చోకుండా స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం మార్పు మననుంచే మొదలవ్వాలనే ఆశయంతో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు చండీఘడ్ సెక్టార్ 49 లో చిన్న రిక్షాబండిలో వీధుల్లో చెత్తను తొలగించే పనికి పూనుకున్నాడు
సమాజం పట్ల ఆ పెద్దాయన అంకిత భావం గమనించిన ఆనంద్ మహీంద్రా శాల్యూట్ పెద్దాయనా అంటూ రిటైర్డ్ పోలీస్ అధికారి గొప్పతనాన్ని ప్రశంసిస్తూ పెట్టిన ట్వీట్ వైరల్ అవడంతో నెటిజన్లు ఆ వృద్దుడ్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు
హాట్సాఫ్ పెద్దాయనా !