ముఖ్యమంత్రిని కూడా బురిడీ కొట్టించిన యూరో లాటరీ కోలా కృష్ణమోహన్ ఎలా దొరికిపోయాడు ? జర్నలిస్ట్ పేజీ – 2

Spread the love

యూరో లాటరి కోలా కృష్ణమోహన్ స్టోరీ తెలుసు కదా ?

ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే షుమారు 80 కోట్ల సైబర్ ఫ్రాడ్ చేసిన టక్కరి దొంగ
అసలు సైబర్ నేరాలకు ఆద్యుడు కోలా కృష్ణమోహన్

అయితే తనకు యూరో లాటరీ వచ్చిందని మీడియాను , రాజకీయ నాయకులనూ , సెలెబ్రిటీలను బురిడీ కొట్టించిన కోలా కృష్ణ మోహన్ ఆఖరికి ఎలా దొరికిపోయాడు ?

ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం స్టోరీ చదవండి

1998 లో రాత్రి సరిగ్గా పేపర్ ఎడిసన్ ప్రింటింగ్ కు వెళ్లేముందు విజయవాడ ఆంద్రజ్యోతికి ఒక మెయిల్ వచ్చింది

విజయవాడకు చెందిన కోలా కృష్ణ మోహన్ అనే వ్యక్తికి 12. 5 మిలియన్ల యూరో పౌండ్స్ లాటరి వచ్చింది అనే మెసేజ్ అందులో ఉంది

వెంటనే ఆంధ్రజ్యోతి డెస్క్ ఇంచార్జి ప్రింటింగ్ ఓ పదినిముషాలు ఆపమని సంబంధిత సెక్షన్ కు చెప్పి తమకు వచ్చిన ఈ మెయిల్ ఒరిజినలా కా దా ? అని కంఫర్మ్ చేసుకోవటానికి వెరిఫై చేసారు

అవతలి వాళ్ళు ఇలా వెరిఫై చేసుకుంటారని ముందే ఊహించి కోలా కృష్ణ మోహన్ దానికి తగ్గ ఏర్పాటు కూడా చేసుకున్నాడు

ఆంధ్రజ్యోతి నుంచి మెయిల్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ రాగానే వెరిఫైడ్ కంఫర్మ్ అని రిప్లై మెసేజెస్ వచ్చాయి

దాంతో ఈ న్యూస్ నిజమే అని ఆంధ్రజ్యోతి డెస్క్ ఇంచార్జి కూడా నమ్మి అప్పటికప్పుడు మెయిన్ పేపర్ బ్యానర్ ఐటెం మార్చి యూరో లాటరీ తగిలిన విజయవాడ వాసి కోలా కృష్ణమోహన్ అని ఒక ఆర్టికల్ రాసి ఎడిసన్ ప్రింటింగ్ కి పంపించారు

అప్పటికి ఈ మెయిల్ ఇతర ఏ పేపర్లకు రాలేదు

కానీ ఆంధ్ర జ్యోతి ఎడిసన్ ఇంచార్జి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుంటే అనుకోకుండా దారిలో వార్త ఎడిసన్ ఇంచార్జి గోపి చంద్ ఎదురవడంతో రేపు జ్యోతిలో సెన్సేషనల్ న్యూస్ బ్యానర్ ఐటెం గా వస్తుంది చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు
అంతేకానీ అసలు విషయం చెప్పలేదు

అప్పుడు వార్త డెస్క్ ఇంచార్జి గోపి చంద్ కు డౌట్ వచ్చింది

సాధారణంగా పబ్లిష్ చెయ్యాల్సిన న్యూస్ ఐటమ్స్ ఏవైనా సరే అన్ని పేపర్లకూ వస్తాయి
ఒకవేళ లీకులు అనుకున్నా అవి కూడా అన్ని పేపర్లకు చేరతాయి

కానీ ప్రత్యేకంగా ఒక పేపర్ కే ఎవడో న్యూస్ ఐటెం పంపించాడంటే ఇదేదో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన స్కెచ్ అని అనుమానం వచ్చి అప్పటికప్పుడు వార్త జర్నలిస్ట్ రాజేష్ కు ఫోన్ చేసి అర్జెంట్ గా రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆంధ్ర జ్యోతి మెయిన్ పేజీలో ఏముందో చూడమని చెప్పాడు

రైల్వే స్టేషన్ కు ఎందుకంటె ఆ రోజుల్లో ప్రింట్ అయిన పేపర్ బండిల్స్ రైళ్ల ద్వారానే చుట్టుపక్కల ఊళ్లకు చేరేవి

సరే టైం చూసుకుంటే అర్ధరాత్రి అవుతుంది
అప్పటికి వార్త పేపర్ కూడా ప్రింటింగ్ కు వెళ్ళిపోయింది
ఎందుకైనా మంచిదని మొత్తం ప్రింట్ కాకుండా చిన్న కాలం అపి ఉంచారు

ఈలోపు వార్త జర్నలిస్ట్ రాజేష్ ఫోటో గ్రాపర్ రూబెన్ ను తీసుకుని హుటాహుటిన రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆంధ్రజ్యోతి పార్సిల్ బండిల్స్ లో ఉన్న ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిసన్ బ్యానర్ ఐటెం చూసారు

విజయవాడకు చెందిన కోలా కృష్ణ మోహన్ కు యూరో లాటరీ అని బ్యానర్ న్యూస్ కనిపించింది
దాంతో అప్పటికప్పుడు ఆ వార్తను కంపోజింగ్ కు పంపించి వార్తలో కూడా చిన్న ఐటెం వేశారు

పొద్దునే ఏఈ వార్తా దావానలంలా ఏపీ మొత్తం పాకింది
దాంతో అందరి దృష్టి కోలా కృష్ణ మోహన్ మీద పడింది

అసలు ఎవరీ కోలా కృష్ణ మోహన్ ? అతడికి యూరో లాటరీ ఎలా వచ్చింది ? పోనీ ఫేక్ అనుకుందామా అంటే న్యూస్ పేపర్లలోనే వచ్చింది

దాంతో ఏపీ అంతా కోలా కృష్ణ మోహన్ పేరు మారుమోగిపోయింది

ఆ రోజుల్లో 12. 5 మిలియన్ యూరో పౌండ్స్ అంటే షుమారుగా 83 కోట్లు అంటే మాటలు కాదు

దరిమిలా కోలా కృష్ణ మోహన్ ఇంటికి సెలెబ్రిటీలు , రాజకీయ నాయకులూ , బ్యాంక్ అధికారులూ , అప్పులు ఇచ్చేవాళ్ళు క్యూ కట్టారు

కోలా కృష్ణమోహన్ అడక్కుండానే లక్షల రూపాయలకు చెక్కులు అతడి చేతిలో పెట్టి పోయారు చాల మంది

ఇప్పుడు కోలా కృష్ణమోహన్ సెలెబ్రిటీ అయిపోయాడు
పోలీస్ డిపార్ట్మెంట్ కోలా కు గన్ మెన్ ను కూడా ఇచ్చింది

కోట్లు ఖరీదు చేసే విల్లా లో నివాసం , బయటికి వెళ్తే ఫారిన్ కారు .. టోటల్ గా కోలా లైఫ్ స్టైల్ మారిపోయింది

కోలా యెంత ఘటికుడు అంటే ఆఖరికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కూడా నమ్మించాడు
టీడీపీకి పార్టీ ఫండ్ కింద కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు

పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ ఫేర్ కి 1,50,000 / రూపాయలు విరాళం ప్రకటించాడు

మచిలీపట్టణం నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించుకున్నాడు

ఇలా ఆరు నెలలు గడిచిపోయాయి

ఫార్మాలిటీస్ వల్ల ఆలస్యం అవుతుందని ఇవాళో రేపో డబ్బులు వచ్చేస్తాయని జనాల్ని నమ్మించడం మొదలు పెట్టాడు

ఈ విషయం వార్త చైర్మన్ గిరీష్ సంఘీ దాకా వెళ్ళింది

వెంటనే ఆయన విజయవాడ వార్త బ్యూరో జర్నలిస్ట్ రాజేష్ కు ఫోన్ చేసి కోలా విషయంలో ఫాక్ట్స్ చెక్ అసైన్మెంట్ అప్పచెప్పారు

ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వార్త జర్నలిస్టులు రాజేష్ అండ్ గౌరీ శంకర్ లు కోలా వెబ్ సైట్ చెక్ చేసారు
అక్కడ ఈ మెయిల్ ఆక్టివ్ లోనే ఉండి వెరిఫికేషన్ కన్ఫిర్మేషన్ ఇచ్చింది

కోలా కృష్ణమోహన్ గత జీవితం గురించి ఎంక్వైరీ చేస్తే కొన్ని నిజాలు తెలిసాయి

యితడు గతంలో విజయవాడ క్లబ్ లో పేకాటలు ఆడేవాడనీ .. ఆ పేకాటలో పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడని తెలిసింది

అంతేకాదు కోలా ఈమధ్యనే స్పాన్సర్షిప్ ట్రిప్ మీద US అండ్ UK కూడా వెళ్ళొచ్చాడని కూడా తెలిసింది

కోలాకు గవర్నర్ పేట ఆంధ్రా బ్యాంక్ లో అకౌంట్ ఉందని తెలిసి అతడి బ్యాంక్ ట్రాన్సక్షన్స్ వెరిఫై చేద్దామని బ్యాంక్ కు వెళ్ళాడు ఇద్దరు జర్నలిస్టులు

సరిగ్గా అదే సమయంలో బ్యాంకులో ఇన్స్పెక్షన్ జరుగుతుంది

బ్యాంక్ మేనేజర్ ను కలిసి తామొచ్చిన పని గురించి చెప్తే విలేఖరులు అని తెలిసి ముందు బ్యాంక్ మేనేజర్ గజగజా వణికిపోయాడు

ఆ తర్వాత మెల్లిగా అసలు విషయం చెప్పాడు

“సార్ ? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవరికీ చెప్పకండి సార్ .. యూరో లాటరీ వచ్చిందని చెప్పి బ్యాంకులో లండన్ బ్యాంక్ బాండ్స్ పెట్టి 20 లక్షలకు చెక్ డిస్కౌంట్ చేసుకున్నాడు .. అది కాస్తా బౌన్స్ అయింది .. మా బ్యాంక్ తరుపున లండన్ బ్యాంక్ అధికారులను ఎంక్వైరీ చేస్తే ఆ బాండ్స్ ఫేక్ అని తెలిసింది .. కాసేపట్లో పై అధికారులు వస్తున్నారు .. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు .. అప్పటిదాకా ఈ విషయం నేను చెప్పినట్టు ఎవరికీ చెప్పకండి సార్ .. “అని ప్రాధేయపడ్డాడు

ఏదైతేనేమి కోలా విషయంలో పెద్ద చిక్కుముడి వీడింది

నిమిషాల్లో ఈ వార్త వార్తా పత్రికకు వెళ్లడం .. ప్రింటింగ్ అవడం ..కోలా అరెస్ట్ అవడం చకచకా జరిగిపోయాయి

కోలా అరెస్ట్ వార్త బయటికి రాగానే యూరో లాటరీ డబ్బులు వస్తాయని ఆశపడి అతడికి అప్పులు ఇచ్చినవాళ్ళందరూ పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టారు

ఆ రకంగా అందర్నీ నమ్మించి మోసం చేసిన బురిడీ రాయుడు కోలా చట్టానికి దొరికిపోయాడు
ఇంతా చేసి కోలాకు నాలుగేళ్లు జైలు శిక్ష మాత్రమే పడింది !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!