Home » బెల్లంకొండ చెప్పినట్టు కిష్కింధపురి ప్రేక్షకులను నిజంగానే భయపెట్టిందా ? థ్రిల్ పంచిందా ?

బెల్లంకొండ చెప్పినట్టు కిష్కింధపురి ప్రేక్షకులను నిజంగానే భయపెట్టిందా ? థ్రిల్ పంచిందా ?

Spread the love

బెల్లంకొండ చెప్పినట్టు కిష్కింధపురి ప్రేక్షకులను నిజంగానే భయపెట్టిందా ? థ్రిల్ పంచిందా ?

కిష్కింధపురి టైటిల్ చూడగానే ఇదేదో రామాయణ కాలం నాటి డివోషనల్ ఇతివృత్తంతో కూడుకున్నది అనుకుంటాం
కానీ ఫక్తు దయ్యం సినిమా

ప్రారంభం అవడం మాత్రం రాముడి గుడిలో వానర సైన్యం యుద్ధం జరిగిన కిష్కింధపురి పోలికను టచ్ చేస్తూ కధనం మొదలౌతుంది

సినిమా దయ్యాలు , దుష్ట శక్తులకు సంబంధించింది కాబట్టి హీరో చేతికి రాముడి కంకణం ధరింపచేయడం కథ స్పూర్తిలో భాగమే అయ్యుంటుంది

దుష్ట శక్తులు ఒకవైపు , దైవ శక్తి మరొకవైపు అన్నది సింబాలిక్ గా చూపించే ప్రయత్నం కథ మొదట్లోనే దర్శకుడు ఎన్నుకున్నాడు

అలా డివోషనల్ ఎలిమెంట్స్ ను టచ్ చేస్తూ కథను హర్రర్ థ్రిల్లింగ్ వైపు వేగంగా తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు

బెల్లం కొండ శ్రీను , అనుపమ పరమేశ్వరన్ జంటగా గతంలో రాక్షసుడు సినిమా వచ్చింది

మళ్ళీ వాళ్లిద్దరూ పెయిర్ గా హర్రర్ జానర్ లో కిష్కిందపురి సినిమా రావడంతో ప్రేక్షకులలో సహజంగా కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి

దానికి తోడు సినిమా మొదలైన పదినిమిషాల తర్వాత ఎవరన్నా మొబైల్ ఫోన్ పట్టుకుంటే తాను సినిమాలు చేయడం మానేస్తానని బెల్లంకొండ శ్రీను కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది

సినిమా చూసే ప్రేక్షకుడు అంతగా థ్రిల్ అయి ఫోన్ కూడా చూడరని ఛాలెంజ్ చేసారు

మరి కిష్కింధపురి ప్రేక్షకులను నిజంగానే అంతగా థ్రిల్ చేసిందా ? అంతగా భయపెట్టిందా ? ఇప్పుడు చూద్దాం

కథ విషయానికి వస్తే ,

ఈ టైపు దయ్యం కథలతో గతంలో కూడా చాలా సినిమాలు వచ్చినప్పటికీ దర్శకుడు కౌశిక్ కిష్కింధపురిని వినూత్నంగా తెరకెక్కించి ప్రేక్షకులను థ్రిల్లింగ్ లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు

1989 లో ఓ రేడియో స్టేషన్లో జరిగిన కథ కిష్కింధపురి

మీరు గమనించారా ? ఇప్పటికీ పెద్ద పెద్ద మాల్స్ లోనూ , ఎగ్జిబిషన్స్ లోనూ దయ్యాల కొంప అని చీకటి హట్ లు ఉంటాయి

టికెట్లు తీసుకుంటే చీకటి గుహలోకి పంపిస్తారు

లోపల సెట్టింగ్స్ చూస్తే చాలామంది థ్రిల్ అవుతారు .. కొంతమంది భయపడతారు

అలాంటి కాన్సెప్ట్ తీసుకుని ఘోస్ట్ వాకింగ్ టూర్ పేరిట థ్రిల్లింగ్ అస్సైన్మెంట్లు చేస్తుంటారు రాఘవ ( బెల్లంకొండ ) మైధిలి ( అనుపమ )

దయ్యాలు , ప్రేతాత్మల ఎక్స్పీరియన్స్ సభ్యులకు కలిగేలా టూర్ కండక్ట్ చేయడం వీరి పని

అలా ఓ 11 మందిని కిష్కింధపురి లో ఉన్న సువర్ణ మాయ అనే రేడియో స్టేషన్ కు తీసుకెళ్తారు

ఎప్పుడో మూతపడి పాడుబడ్డ ఆ రేడియో స్టేషన్లోకి తలుపులు బద్దలు కొట్టుకుని మరీ ప్రవేశిస్తారు

అయితే అక్కడే వీరికి ఊహించని అనుభవం ఎదురౌతుంది

వేదవతి అనే దయ్యం వీరిలో ఒకరొకర్ని చంపేస్తూ ఉంటుంది

ఊహించని ఈ పరిణామానికి రాఘవ ముందు భయపడతాడు .. ఆ తర్వాత ధైర్యంగా ఎదుర్కొంటాడు

అసలు సువర్ణమాయ రేడియో స్టేషన్ ఎందుకు మూత పడింది ?

వేదవతి అనే రేడియో ఆర్టిస్ట్ దయ్యంగా ఎందుకు మారింది ?

ఈ 11 మందిని చంపాలని ఎందుకు ప్రయత్నిస్తుంది ?

సువర్ణమాయలో ఉన్న రాక్షస శక్తి విశ్వవపుత్ర( శాండీ మాస్టర్ ) ఎవరు ?

రాఘవ విశ్వవ పుత్రను ఎలా ఎదుర్కొంటాడు ?
అనేవి మిగతా కధలో తెలుస్తాయి

ఎవరెలా చేసారు ?

హర్రర్ జానర్ కు తగినట్టుగా చక్కటి హావభావాలు ప్రదర్శించి తనకు ఇది కొట్టిన పిండి అనిపించుకున్నాడు బెల్లంకొండ

గతంలో యితడు రాక్షసుడు సినిమాలో కూడా చక్కటి పెర్ఫార్మెన్స చూపించి ప్రేక్షకుల మెప్పు పొందాడు

కిష్కింధపురి క్లైమాక్సులో తనతో తానే పోట్లాడుకునే సన్నివేశంలో గూస్ బంప్స్ తెప్పించాడు
అలాగే సినిమాలో బెల్లంకొండకు మంచి డైలాగులు పడ్డాయ్

ఇక అనుపమ పరమేశ్వరన్ కూడా నటన పరంగా చక్కటి పెర్ఫార్మెన్స్ ప్రదర్శించింది
ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు దయ్యం ఆవహించే సీన్ లో భయపెట్టింది

సినిమాని అనుకున్న విధంగా థ్రిల్లింగ్ గా మలచడంలో చాలావరకు దర్శకుడు కౌశిక్ విజయం సాధించాడు
అవసరమైన చోట ట్విస్టులతో కథను రకరకాల మలుపులు తిప్పాడు

సువర్ణమాయ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యేవరకు ప్రేక్షకులు అదే థ్రిల్ పొందుతారు
ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుందో కథ ప్రేక్షకులకు అర్దమైపోయి రొటీన్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతుంది

ఏ సినిమాలో ఇంకో కీలకమైన పాత్ర విశ్వవపుత్ర
మంచి పెర్ఫార్మెన్స కు స్కోప్ ఉన్న పాత్ర

శాండీ మాస్టర్ ఈ పాత్రకు పూర్తి న్యాయం చేసాడు

ఇటువంటి దయ్యం సినిమాలకు ప్రాణం పోసేవి విజువల్స్ అండ్ బీజీఎమ్
ఆ రెండూ సరిగా లేకపోతె ప్రేక్షకులకు థ్రిల్ రాదు

విజువల్స్ పరంగా చిన్మయ్ సలాస్కర్ చక్కటి సినిమాటోగ్రఫిని ప్రదర్శించగా , చైతన్య భరధ్వాజ్ బీజీఎమ్ స్కోర్ తో హైప్ తీసుకొచ్చారు

ముగింపు : బెల్లంకొండ శ్రీను ఛాలెంజ్ చేసినట్టుగా సినిమా ప్రేక్షకులకు థ్రిల్ పంచుతుంది

నటీనటులు : బెల్లంకొండ శ్రీను , అనుపమ పరమేశ్వరన్ , తనికెళ్ళ భరణి , హైపర్ ఆది , శ్రీకాంత్ అయ్యంగార్ , శాండీ మాస్టర్
నిర్మాత సాహు గారపాటి
దర్శకుడు : కౌశిక్ పెగళ్ళపాటి

సెప్టెంబర్ 12 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది

రేటింగ్ : 3 / 5
పరేష్ తుర్లపాటి


Spread the love

One thought on “బెల్లంకొండ చెప్పినట్టు కిష్కింధపురి ప్రేక్షకులను నిజంగానే భయపెట్టిందా ? థ్రిల్ పంచిందా ?

  1. Ok. Manchi review. Chinna సినిమాలు ఆడితే నిర్మాతలు ఎక్కువ సినిమాలు తీసి చాలా మందికి ఆసరా కల్పించిన వారవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *