Home » కృష్ణంరాజును శోభన్ బాబు అనుకున్న అభిమాని .. అప్పుడు కృష్ణంరాజు గారు ఏం చేసారంటే ??

కృష్ణంరాజును శోభన్ బాబు అనుకున్న అభిమాని .. అప్పుడు కృష్ణంరాజు గారు ఏం చేసారంటే ??

Spread the love

ఇవాళ రెబల్ స్టార్ కృష్ణంరాజు వర్ధంతి

దర్శకుడు శివ నాగేశ్వరరావు నాతో కృష్ణంరాజు గురించి చెప్పిన ఒక విషయాన్ని మీతో పంచుకుంటున్న!

ఓ రోజు కోనసీమలో కృష్ణంరాజు గారి సినిమా షూటింగ్ జరుగుతుంది .. అప్పట్లో ఇప్పటిలా ఫెన్సింగ్ అంటూ ఏమీ లేదు. కేవలం పురి కొస తాడు తో ఆ షూటింగ్ ఏరియా లోపలకు జనం రాకుండా కడతారు.

ఎవరైనా చూడటానికి వచ్చినా తాడు దాటి లోపలకు రాకుండా ఆ ఏర్పాటు అన్నమాట

ఇంతలో ఒక అభిమాని అకస్మాత్తుగా తాడు దాటుకుని లోపలకు వచ్చి కృష్ణంరాజు కు షేక్ హ్యాండ్ ఇచ్చాడట!

కృష్ణంరాజు సరదాగా “నేనెవరో తెలుసా?” అని అడిగారట!

“మీరు తెలియని వాళ్ళు ఎవరుంటారు?” అని “మీరు శోభన్ బాబు నాకెందుకు తెలియదు” అన్నాడట ఆ అభిమాని.

“సరే వెళ్ళు” అని భుజం తట్టి ఆ అభిమానిని పంపించారట కృష్ణంరాజు

పక్కనే వున్న దర్శకుడు ఆశ్చర్యపోయి “అదేంటి అతనికి చీవాట్లు పెట్టకుండా పంపించారు?”
అతను “మిమ్మల్ని శోభన్ బాబు అంటే మీకేం బాధ అనిపించలేదా?” అని మళ్ళీ అడిగాడట!

కృష్ణంరాజు నవ్వి “నేనెందుకు బాధ పడాలి..? ఆ విషయం తెలిస్తే శోభన్ బాబు బాధ పడాలి.. నన్ను చూసి శోభన్ బాబు అనుకున్నాడంటే అసలు ఒరిజినల్ శోభన్ బాబు ను గుర్తు పట్టలేదని ఆయన బాధపడాలి” అనగానే ఇద్దరూ నవ్వుకున్నారట!

ఆనాటి రోజుల్లో ఇంతటి పాజిటివ్ థింకింగ్ తో ఉండేవారు

అదే ఇంకో స్టార్ ను ఇదే మాట అంటే ఆ అభిమానిని కొట్టిస్తారు. అలా మారిపోయాయి రోజులు
కృష్ణంరాజులో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చుతుంది!

“నాయాల్ది కత్తి అందుకో జానకీ” ఇది కృష్ణంరాజు పాపులర్ డైలాగ్!

కృష్ణంరాజు ను నేను చాలాసార్లు కలిశాను. ఇంటర్వ్యూ లు చేశాను. ఎంత సేపు వున్నా ఆ నవ్వు మాత్రం చెదిరేది కాదు!

భోజనం చేయకుండా వెళ్లనివ్వరు!

ఆయన గంభీరంగా ఉండటంతో చాలా మంది మాట్లాడటానికి భయపడే వారు కానీ, ఆయనతో మాటలు కలిస్తే అయనంత జోవియల్ ఇంకెవ్వరూ ఉండరు. అంత మంచి స్వభావం గల వ్యక్తిత్వం కృష్ణంరాజు!

సహజంగా రవీంద్రభారతికి స్టార్స్ వస్తున్నప్పుడు కాస్త హల్ చల్ ఉంటుంది

బౌన్సర్స్ జనాన్ని నెట్టే హడావిడి ఉంటుంది

ఆ స్టార్ కూడా పదే పదే వాచీ చూసుకుంటూ చాలా బిజీగా వున్నా, త్వరగా వెళ్ళాలి అనే టైపులో బిల్డ్ అప్ ఇస్తుంటారు

ఒక్క కృష్ణంరాజు మాత్రం సింపుల్ గా వచ్చేస్తారు. నవ్వుతూ అందరినీ అభినందించి వెళ్లేవారు!

అంతేకాదు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా ముక్కు సూటిగా చెప్పేవారు
రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు

సినిమా రంగంలోనూ శాశ్వత ముద్ర వేసుకున్నారు. ఆత్మీయ మిత్రులు కృష్ణంరాజు కు శ్రద్దాంజలి.

  • డా. మహ్మద్ రఫీ

Spread the love

One thought on “కృష్ణంరాజును శోభన్ బాబు అనుకున్న అభిమాని .. అప్పుడు కృష్ణంరాజు గారు ఏం చేసారంటే ??

  1. Great actor. Sraddhanjali. Naku nachina కృష్ణంరాజు cinema కటకటాల రుద్రయ్య.. 1971 లో నేను హీరో కృష్ణ ఇంట్లో ఉన్నప్పుడు కృష్ణంరాజు గారిని చాలా సార్లు చూసాను. భలే హుందాగా ఉండేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *