తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన సునీల్ నారంగ్ తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు.. అది కూడా బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లోనే! పదవీ బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే సునీల్ రాజీనామా చేయడం వెనక పెద్ద కారణాలే ఉన్నాయని ప్రస్తుతం సినీ పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్న మాట.. గత కొద్ది రోజులుగా ఏపీలో థియేటర్ల బంద్ నిర్ణయం పట్ల వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే
సరిగ్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరహర వీరమల్లు సినిమా రిలీజ్ ముందే థియేటర్ల బంద్ నిర్ణయం అగ్గి రాజేసింది..ఈ నిర్ణయం వెనక నలుగురు ఉన్నారని అప్పట్లోనే విమర్శలు గుప్పుమన్నాయి..ఈ నిర్ణయం పై పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యి ఇకమీదట సినీ పెద్దలతో వ్యక్తిగత చర్చలు ఉండవని.. ఎవరైనా ఛాంబర్ ద్వారా మాత్రమే రావాలని.. వారితో మాత్రమే ప్రభుత్వం చర్చలు జరుపుతుందని సృష్టం చేసారు.
దరిమిలా ఏపీలో దాదాపు అన్ని థియేటర్ల మీద అధికారులు దాడి చేసి క్యాంటీన్ల లో ఆహార నాణ్యత మీదా.. టికెట్ రేట్ల మీదా కేసులు బుక్ చేసారు.. మరోవైపు ఆ నలుగురిలో తాము లేమని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజులు మీడియా సమక్షంలో ప్రకటించారు.
ఈ పరిణామాల నేపద్యంలో శనివారం తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత మరియు ఏషియన్ థియేటర్స్ అధినేత సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు.. అయితే ఎవరూ ఊహించని విధంగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే సునీల్ తన పదవికి రాజీనామా చేసారు
శనివారం పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో కూడా సునీల్ మాట్లాడుతూ హీరోల రెమ్యునరేషన్ విషయంలో కల్పించుకునే హక్కు తమకు లేదనీ అయితే వాళ్లు ఎక్కవ సినిమాలు చేసి ఇండస్ట్రీని ఆదుకోవాలని తన ఆకాంక్ష అన్నారు ..ఇక థియేటర్ల వివాదం గురించి మాట్లాడుతూ సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజ్ విధానం అమలు కావాలని 2016 నుంచి తాను పోరాడుతున్నామని అయితే థియేటర్ల బంద్ చెయ్యాలని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు.. అంతేకాదు థియేటర్ల వివాదంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఆ నలుగురిలో తాను లేనని సృష్టం చేసారు.
ఇన్ని చెప్పిన సునీల్ నారంగ్ 24 గంటల్లోనే తన పదవికి రాజీనామా చేసారు ” ఇండస్ట్రీలో కొందరి వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని.. నాతో సంప్రదించకుండా ప్రకటనలు చేస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను పదవిలో కొనసాగలేను అని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది
మొత్తానికి పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు రిలీజ్ కాకముందే సంచలనం రేపిన థియేటర్ల బంద్ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ సంచలనాలు సృష్టిస్తుంది..ఈ వివాదం ముందు ముందు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియాలంటే వేచి చూడాలి!
పరేష్ తుర్లపాటి ✍️