వెండితెర వెలుగులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు పాన్ గ్లోబల్ ఫిలిం ప్రమోషన్ కౌన్సిల్ ఆవిర్భావం
భారతీయ సినిమాలకు ప్రపంచవ్యాప్త వేదికలలో సహాయ సహకారాలు అందించటానికి జంగా చైతన్య అధ్యక్షుడిగా పాన్ గ్లోబల్ ఫిలిం ప్రమోషన్ కౌన్సిల్ అనే సంస్థ ఏర్పడింది
సినిమా రంగాన్ని గ్లోబల్ స్థాయికి విస్తరించడం లక్ష్యంగా సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనుంది
పాన్ గ్లోబల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సినిమా రంగానికి ఉన్న అవకాశాలు గుర్తించి చిత్ర నిర్మాణదారులకు సహాయపడుతుంది
సినిమా చిత్రీకరణలో సాంకేతిక రంగంలో కానీ , షూటింగ్ కు అనువైన లొకేషన్ల విషయంలో కానీ , స్థానిక కళాకారుల విషయంలో కానీ ఇతర అవసరమైన విషయాల్లో నిర్మాణ సంస్థలకు తగిన సలహాలు , సూచనలు , మార్గదర్శకత్వం వహించే ప్లాట్ ఫార్మ్ గా ఈ సంస్థ కార్యకలాపాలు చేపడుతుంది
చిత్ర నిర్మాతలు , పంపిణీదారులు ప్రపంచవ్యాప్తంగా తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో ఈ సంస్థ తోడ్పాటు అందిస్తుంది
ట్రైలర్లు , పోస్టర్లు , ఇన్ఫ్లుయన్సర్లు , ఇతర ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చిత్ర ప్రమోషన్ బాధ్యత ఈ సంస్థ తీసుకుంటుంది
ప్రపంచ వ్యాప్తంగా చిత్ర పంపిణీ కి సంబంధించి అంతర్జాతీయ కొనుగోలుదారులతో డీల్ కుదుర్చుకునేందుకు పంపిణీదారులకు ఏర్పాట్లు చేస్తారు
ప్రస్తుతం ఇతర రంగాల మాదిరే సినీ పరిశ్రమ కూడా గ్లోబల్ స్థాయిలో బిజినెస్ చేస్తుంది
అందువల్ల గ్లోబల్ ఫిలిం మార్కెట్ మరింత విస్తృత పరిచే దిశగా పాన్ గ్లోబల్ ఫిలిం కౌన్సిల్ కృషి చేస్తుంది
ఫిలిం మార్కెట్ కు చేరుకోలేని దేశాలను గుర్తించి ఫిలిం ఎక్స్చేంజి ఈవెంట్ ద్వారా ఆయా ప్రాంతాల్లో కూడా సినిమా రంగాన్ని ప్రమోట్ చేయడంలో సంస్థ ఏర్పాట్లు చేస్తుంది
భారతదేశంలో సినిమా షూటింగులకు అనువైన అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయని , ప్రపంచ సినిమా రంగానికి వీటిని పరిచయం చేస్తే ఆయా ప్రాంతాల్లొ పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతుందని ఆ బాధ్యతను తమ సంస్థ తీసుకుంటుందని సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి విజయ్ వర్మ పాకలపాటి చెప్పారు
దీనివల్ల పర్యాటక ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి కల్పనా అవకాశాలు మెరుగవుతాయని ఆయన అన్నారు
భారతీయ సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయడంలోనూ , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్ర పరిశ్రమను భారతదేశం వైపు ఆకర్శించడంలోనూ తమ సంస్థ ఒక ప్లాట్ ఫారం గా పనిచేస్తుందని ఆయన అన్నారు
సంస్థ యొక్క లోగో ప్రారంభించగానే త్వరలో పాన్ గ్లోబల్ నుంచి కళాకారులు , సాంకేతిక నిపుణులు , చలన చిత్ర నిర్మాతలను తమ సంస్థలో చేర్చుకోబోతున్నట్టు విజయ్ వర్మ చెప్పారు