Home » ఆంధ్రప్రదేశ్

యూపీఏ (ఇండి కూటమి) వైపు జగన్ అడుగులు పడుతున్నాయా ? నిజమేనా ? అసలు పెళ్ళిలో ఏం జరిగింది ?

నిన్న చెన్నైలో జరిగిన వైఎస్ జగన్ కజిన్ కుటుంబంలో జరిగిన వివాహ వేడుక సోషల్ మీడియాలో సరికొత్త రాజకీయ చర్చకు నాంది పలికింది విశేషం ఏంటంటే ఈ వివాహ వేడుకల్లోని దృశ్యాలను వైసీపీతో పాటు టిడిపి సోషల్ మీడియా వింగ్ కూడా ఫొటోలతో , కథనాలతో హోరెత్తించింది వివాహ వేడుకల్లో వైఎస్ జగన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారని ,తమిళ నటులు ,నాయకులూ ఆయనతో కలిసి దిగిన ఫోటోలను వైసిపి సోషల్ మీడియా వింగ్ ఇంటర్నెట్…

Read More

నేటి రాజకీయాల్లో నీతులు మాయం – అంతా బూతుల మయం!

మీరు గమనించారా ? రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైందివిమర్శల స్థానంలో బూతులు రంగప్రవేశం చేసాయి విధానపరమైన నిర్ణయాలపై చర్చకు బదులు వ్యక్తిగత జీవితాలు టార్గెట్ అవుతున్నాయి ఆరోగ్యకరమైన పోటీకి బదులు విద్వేషపూరిత రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి తాము గతంలో ప్రతిపక్షములో ఉన్నప్పుడు అధికార పక్షము అనుసరించిన కక్షపూరిత రాజకీయాలను వ్యతిరేకించిన అదే పార్టీలు తిరిగి అధికారంలోకి వస్తే అవే విధానాలను అనుసరిస్తున్నాయి తాము అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల తీరు బాగుందని కితాబు ఇచ్చే నాయకులూ , ప్రతిపక్షములోకి…

Read More

వాయువేగంతో వెళ్తున్న కారు సడెన్గా ఆగిపోయింది ..ఏమైంది ? అన్నారు వంగవీటి మోహన రంగా .. అప్పుడేం జరిగింది ?

విజయవాడ సింగ్ నగర్ , పాయకాపురం వైపు వాయువేగంతో దూసుకెళ్తున్న వంగవీటి మోహన రంగా కారు గాంధీనగరం వచ్చేసరికి సడెన్గా ఆగిపోయింది “ఏమైంది ? కారు ఎందుకు ఆగింది ?” వంగవీటి ప్రశ్న “అన్నా ! బండిలో పెట్రోల్ అయిపోయింది..ఇంజిన్ అందుకోవడం లేదు”అనుచరుడి జవాబు ఈ సంఘటన షుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం జరిగిందిఅయితే ఈ సంఘటన వెనుక చిన్న నేపధ్యం కూడా ఉంది అప్పటికి వంగవీటి మోహన రంగా రాజకీయ ప్రస్థానం మొదలవ్వలేదుజననాయకుడిగా ప్రజల్లో తిరుగుతున్న…

Read More

వంగవీటి మోహన రంగా హత్య తర్వాత ఏం జరిగింది ?

“నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను ..ఈ ఉదయం జరిగిన ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా హత్యతో విజయవాడలో ఆస్తి , ప్రాణ నష్టాలు జరుగుతున్నాయని రిపోర్టులు వస్తున్నాయి .. అక్కడ సీఎం గారి బంధువులు ఉన్నారు .. తక్షణం వారికి ప్రొటెక్షన్ కల్పించమని సీఎం గారు చెప్పారు “ హైద్రాబాదు నుంచి ఫోన్ చేసి విజయవాడ పోలీస్ బాసుకి ఆదేశాలు ఇచ్చారు సీఎంఓ అధికారి “సర్ .. సిట్యుయేషన్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ .. ప్రస్తుత…

Read More

తనని హత్య చేస్తారని వంగవీటికి ముందే తెలుసా ? డిసెంబర్ 25 రాత్రి ఏం జరిగింది ?

“అన్నా ! నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ తిరుగుతున్నాయి .. మాకెందుకో అనుమానంగా ఉంది .. రోడ్ క్లోజ్ చేసేస్తాం అన్నా” డిసెంబర్ 25 రాత్రి నిరాహార దీక్ష శిబిరంలో ఉన్న వంగవీటి మోహన రంగాను అనుచరులు ఆందోళనగా అడిగారు వారు ఇలా అడగటం వెనుక చిన్న నేపధ్యం ఉంది అసలు గొడవ ఎక్కడ్నుంచి మొదలైంది ? దీనికి మూడురోజుల ముందు విజయవాడ గిరిపురం వాసులకు ఇళ్ల పట్టాల కోసం ఆందోళన చేయడానికి ఇంటినుంచి వంగవీటి బయలుదేరారు…

Read More

మలేషియాలో కూచిపూడి , భరత నాట్యాలు ప్రదర్శించిన మన చిన్నారులను భారతీయ కళలు అద్భుతం అంటూ ప్రశంసిస్తూ ఆ దేశ మంత్రి ఆటోగ్రాఫ్ అడిగాడు.. ఈ ప్రదర్శన వెనుక ఓ సంస్థ ప్రోత్సాహం ఉంది !

ఆశయాలు చాలామందికి ఉంటాయి ..కానీ కొంతమందే వాటిని ఆచరణలో పెట్టి చూపిస్తారుసమాజం నాకేమిచ్చింది ? అని కాకుండా సమాజానికి నేనేమి ఇచ్చాను? అని ఆత్మపరిశీలన చేసుకుని పదిమంది శ్రేయస్సుకు శ్రమించేవాళ్ళు అరుదుగా ఉంటారుఅలా ఆలోచించాలంటే నిస్వార్థ గుణం , ఉన్నత వ్యక్తిత్వం , లక్ష్యాలు ఉండాలిఅలాంటి ఆశయాలతో ఓ వ్యక్తి లాభాపేక్ష లేని సంస్థను స్థాపించి సమాజానికి సేవ చేస్తూ ఇతరులకు మార్గదర్శంగా నిలుస్తున్నారు ! ఇలాంటి ఒక మంచి సంస్థను పదిమందికీ పరిచయం చెయ్యాల్సిన అవసరం…

Read More

తెలంగాణా దిష్టి తగిలిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి ?

బుధవారం నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో పర్యటిస్తూ తెలంగాణా వాళ్ళ దిష్టి తగిలే కోనసీమలో కొబ్బరి పంట నాశనం అయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు ఆయన కోనసీమ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడి కొబ్బరి పంట నష్టాన్ని పరిశీలించారుకొబ్బరి కాయలు మొదలంటా ఎండిపోవడం కనిపించింది కోనసీమ కొబ్బరి పంటకు ప్రసిద్ధి అనీ , పచ్చని పంటపొలాలతో ప్రకృతి రమణీయంగా ఉంటుందని చెప్తూ , తమదగ్గర ఇంత పచ్చదనం లేదని తెలంగాణా వాళ్ళు అసూయతో దిష్టి…

Read More

వంగవీటి మోహనరంగా అభిమానులకు కూతురు ‘ఆశాకిరణం’ అవుతుందా ?

1980 లలో ఏపీ రాజకీయాల్లో ఒక బలమైన సామాజిక వర్గ నాయకుడిగా ఉవ్వెత్తున ఎగసిన కెరటం వంగవీటి మోహన రంగా రాజకీయాల్లో కార్పొరేటర్ గా మొదలైన ఆయన ప్రస్థానం 1985 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యుడిగా ఎదిగే స్థాయికి చేరింది విజయవాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన రంగా రాష్ట్ర నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో 1988 డిసెంబర్ 26 న నిరాహార దీక్షలో ఉండగా హత్యకు గురయ్యారు ఆయన హత్య దరిమిలా…

Read More

రిమాండ్ ఖైదీలకు సదుపాయాలు కల్పించడం కరెక్ట్ కాదా ? మిధున్ రెడ్డి విషయంలో జరుగుతున్న చర్చ ఏంటి ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో మిథున్ రెడ్డి అరెస్ట్ కన్నా జైళ్లో అతడికి కల్పిస్తున్న సదుపాయాలపై ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తుంది తనకు ఆరోగ్య సమస్యలు ఉన్న కారణాన.. భద్రత పరంగా Y కేటగిరీలో ఉన్నందున .. జైళ్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు మిథున్ రెడ్డి మెడికల్ రిపోర్ట్స్.. ఇతర పూర్వాపరాలు పరిశీలించిన మీదట కోర్టు వారు అతడికి జైళ్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆ ఉత్తర్వుల…

Read More

నిజాలను నిజాయితీగా నిష్పక్షపాతంగా వెలుగులోకి తేవడం అంటే ఇదేనా? అసలు జర్నలిజం ఎటు పోతుంది?

ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ భవిష్యత్తులో జర్నలిస్టులు తమ అరెస్ట్ వార్తలను తామే టీవీల్లో చెప్పుకునే రోజులు కూడా వస్తాయేమో కొమ్మినేని అరెస్ట్ అనేది సాధారణ వార్త సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ అనేది సంచలన వార్త సాక్షి టీవీలో జర్నలిస్ట్ కాబట్టే అరెస్ట్ చేశారనేది విచిత్ర వార్త అవన్నీ అలా ఉంచితే అసలు రాన్రాను జర్నలిస్ట్ అనే పదంలో ఎర్నలిస్ట్ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది రాజకీయ నాయకులే వ్యాపారస్తులై మీడియా…

Read More
error: Content is protected !!